టాలీవుడ్ లో ఓ సరికొత్త ప్రయోగం!
సినిమా రంగంలో ఏఐ టెక్నాలజీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఈ టెక్నాలజీని వినియోగించుకుని పని సులభం చేసుకుంటారు.
By: Srikanth Kontham | 3 April 2026 12:10 PM ISTసినిమా రంగంలో ఏఐ టెక్నాలజీ కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది దర్శకులు ఈ టెక్నాలజీని వినియోగించుకుని పని సులభం చేసుకుంటారు. ఎవరి అవసరం మేర వారు ఏఐని తెలివిగా వాడుకుం టున్నారు. అయితే ఏఐ వినియోగంతో పూర్తి స్తాయి సినిమా మాత్రం ఇంత వరకూ రాలేదు. ఈ నేపథ్యంలో తాజాగా `అంబస్ రివెంజ్` అనే ఓ తెలుగు సినిమా సరికొత్త చరిత్ర సృష్టించబోతుంది. పూర్తిస్థాయి కృత్రిమ మేధ సాయంతో తెరకెక్కుతున్న తొలి తెలుగు ఫీచర్ ఫిల్మ్‌గా ఇది రికార్డు సృష్టించబోతోంది. హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేయడంతో టాలీవుడ్‌లో ప్రాజెక్టుపై ఆసక్తి నెలకొంది.
మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన , భావోద్వేగభరితమైన అంబ పాత్ర ఆధారంగా ఈ పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. భీష్ముడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి అంబ పడే వేదన, ఆ తర్వాత ఆమె శిఖండిగా మారే క్రమంలో సాగే ప్రయాణాన్ని అత్యాధునిక సాంకేతికతతో ఆవిష్కరించబోతున్నారు. పౌరాణిక ఇతిహాసానికి ఏఐ టెక్నాలజీని జోడించడం వల్ల విజువల్స్ , పాత్రల రూపకల్పన చాలా వినూత్నంగా ఉండబోతోందని చెప్పొచ్చు.
సాధారణ సినిమాలతో పోలిస్తే ఏఐ ఆధారిత చిత్రాలలో పాత్రల మేకోవర్ , గ్రాఫిక్స్ చాలా సహజంగా ఉంటాయి. తక్కువ సమయంలోనే అద్భుతమైన అవుట్‌పుట్ తీసుకురావచ్చని మేకర్స్ భావిస్తున్నారు. హాలీవుడ్‌లో ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతుండగా తెలుగులో కూడా అలాంటి వినూత్న ప్రయోగం రావడం విశేషం.అంబస్ రివేంజ్ లాంటి సినిమాలు సక్సెస్ అయితే ఏఐ టెక్నాలజీ మరింత వినియోగంలోకి వస్తుంది. ఇప్పటికే చాలా మంది మేకర్స్ ఏఐ టూల్స్ పై ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. పాత డైరెక్టర్ల నుంచి నవతరం దర్శకుల వరకూ అంతా టెక్నాలజీ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
ఇప్పటి వరకూ సినిమా అంటే కేవలం తన మేథస్సు నుంచే పుట్టేది. కానీ నేడు సన్నివేశం అందుకు భిన్నంగా మారింది. ఏఐ వినియోగంతో కావాల్సినన్ని ఇన్ పుట్స్ ఏఐ అందించడంతో పని సులభంగా మారింది.`పాత తరం పౌరాణిక గాథలను కొత్త తరం సాంకేతికతతో కలపడం వల్ల యువతకు కూడా ఇతిహాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. `అంబస్ రివెంజ` లాంటి సినిమాలు సక్సెస్ అయితే ఏఐతో మరిన్ని వండర్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించే ప్రయత్నంలా కనిపిస్తోంది. శ్రీ లలితకళా చిత్రాలు- నక్క తోక ఫిల్మ్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్ రెడ్డి కుందూరు నిర్మాతగా, రాణి మాడిసన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జయవర్ధన్ మాడి చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.
