Begin typing your search above and press return to search.

అంబానీ ఆహ్వానితులంతా వీళ్లేనా?

జామ్‌నగర్‌లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు క‌ల్పిస్తున్నారు

By:  Tupaki Desk   |   1 March 2024 10:26 AM GMT
అంబానీ ఆహ్వానితులంతా వీళ్లేనా?
X

అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వేడుక‌తో జామ్ న‌గ‌ర్ జామ్ అయింది. మూడు రోజుల వేడుక‌లో భాగంగా ప్ర‌పంచదేశాల నుంచి పారిశ్రామిక వేత్త‌లు...ఐటీ దిగ్గ‌జాలు..సినీ..రాజ‌కీయ‌..క్రీడాకారుల‌తో జామ్ న‌గ‌ర్ కి కొత్త క‌ళ వ‌చ్చేసింది. దేశీయంగా ముంబై...ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానాల ద్వారా అతిధులు త‌ర‌లిస్తున్నారు. ఆ రెండు ప్రాంతాల నుంచి ఎయిర్ బ‌స్సులు ఎర్ర బ‌స్సుల్లా తిరిగేస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి అతిరథ మహారథులు హాజరవుతారు.

జామ్‌నగర్‌లో 5 స్టార్ హోటళ్లు లేకపోవడంతో వాటికి ఏ మాత్రం తగ్గకుండా అతిథులకు సౌకర్యాలు క‌ల్పిస్తున్నారు. ఏకంగా 5 స్టార్ హోటళ్లను తలదన్నేలా అల్ట్రా- లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేసారు. అతిధులు ఎవ‌రూ అసౌక‌ర్యానికి గురి కాకుండా టెంట్లలో టైల్డ్ బాత్‌రూమ్‌లు సహా అన్ని ఏర్పాట్లు చేసారు. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్.. షారుక్ ఖాన్ సహా క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూ ల్కర్.. ఎంఎస్ ధోనీ..జ‌హీర్ ఖాన్.. రోహిత్ శర్మ.. కేఎల్ రాహుల్.. హార్దిక్ పాండ్యా.. ఇషాన్ కిషన్ ఉన్నారు.

ఇంకా ఎంతో మంది ఫేమ‌స్ సింగ‌ర్లు సైతం వేడుక‌లో భాగ‌మ‌వుతున్నారు. బాలీవుడ్ నుంచి ప‌లువురు సింగ‌ర్ల‌కు ప్ర‌త్యేక ఆహ్వానం అందిన‌ట్లు తెలుస్తోంది. నేటి ఉద‌య‌మే వారంతో జామ్ న‌గ‌ర్ చేరుకున్నారు. హాలీవుడ్ పాప్ గాయని రిహన్నాతో పాటు దిల్జీత్ దోసాన్జ్ ఇతర గాయకులు అక్క‌డ ప్ర‌త్యేక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. నేటి సాయంత్రం అస‌లైన వేడుక ప్రారంభం కాబోతుంది. ఇందులో సెల‌బ్రిటీలంతా పాల్గొనే అవ‌కాశం ఉంది.

అనంత‌రం అతిధులందరికీ ప్ర‌త్యేకంగా కాక్ టాయిల్..మోక్ టెయిల్ పార్టీలు ఏర్పాటు చేసారు. ఇందులో ర‌క‌ర‌కాల టీమ్ ల గానూ డివైడ్ చేసారుట‌. ఎవ‌రికి వారు స‌ప‌రే ట్ గా ఓ ప్ర‌త్యేక పార్టీతో పాటు...అంద‌రు క‌లిసి కూర్చుని ఎంజాయ్ చేసేలా మ‌రో ప్ర‌త్యేక హాలును పార్టీ కోసం కేటాయించారుట‌. ఇలా మూడు రోజుల పాటు సాయంత్రం నుంచి ఈ పార్టీ మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది.