Begin typing your search above and press return to search.

సుహస్ AMB ట్రైలర్.. ప్రేమ ప్రాణం మీదకు రాకూడదు

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న సుహాస్ గురించి అందరికీ తెలిసిందే

By:  Tupaki Desk   |   24 Jan 2024 6:39 AM GMT
సుహస్ AMB ట్రైలర్.. ప్రేమ ప్రాణం మీదకు రాకూడదు
X

కలర్ ఫొటో సినిమాతో హీరోగా మారి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్న సుహాస్ గురించి అందరికీ తెలిసిందే. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాస్.. గతేడాది రైటర్ పద్మభూషణ్ చిత్రంతో అంతకు మించిన క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా కూడా హిట్టవడంతో ఆయన రేంజ్ యే మారిపోయింది. సుహాస్ ఇప్పుడు అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్(AMB) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.


సుహాస్ హీరోగా మరో సినిమా అంటే కచ్చితంగా బాగుంటుందని ముందే సర్టిఫికేట్లు ఇచ్చేస్తున్నారు సినీ ప్రియులు. ఈక్రమంలోనే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా అప్డేట్ల గురించి వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తోపాటు టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా థియేట్లికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. ఫిబ్రవరి 2వ తేదీన సినిమా రిలీజ్ కానున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

పూర్తిగా పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. కామెడీతో ప్రారంభమై మధ్యలో రొమాన్స్ ను టచ్ చేసి చివరకు ఎమోషనల్ గా ముగిసింది. సుహాస్ మ్యారేజీ బ్యాండ్ లీడర్ మల్లి పాత్రలో నటించగా.. యాక్టింగ్ ఇరగదీశారు. హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ కూడా అదిరిపోయింది. లవ్ కెమస్ట్రీ కూడా బాగానే పండింది. సగం వరకు సరదాగా సాగిన ట్రైలర్ సీరియస్ మోడ్ లోకి వెళ్లిపోయింది.

ఓ విషయంలో హీరోను గుండు గీయిస్తారు విలన్. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ లో సుహాస్ పవర్ ఫుల్ డైలాగ్ తో అదరగొట్టారు. గ్రామంలో తనతోపాటు తన అక్క పరువు తీసిన విలన్ ఫ్యామిలీపై సుహాస్ రివెంజ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. చివర్లో హీరోయిన్.. తమ ప్రేమ ప్రాణం మీద రాకూడదంటూ చెబుతున్న ఎమోషనల్ డైలాగ్ ఆకట్టుకుంటోది. కామెడీ, ఫైట్, రొమాన్స్.. ఇలా అన్ని రసాలతో రంగరించిన ఈ సినిమా ట్రైలర్ ను చూస్తే మంచి ఫీల్ వస్తోంది.

సినిమా కోసం సుహాస్ గుండు కొట్టించుకోవడం చూస్తుంటే... మూవీ కోసం ఆయన ప్రాణం పెట్టారని అర్థం అవుతోంది. గత చిత్రాల్లాగానే సుహాస్ కు ఈ సినిమా కూడా కెరీర్ గ్రాఫ్ గా నిలిచిపోతుందని అంతా భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సుహాస్ సరసన శివాని నాగరం నటిస్తున్నారు.

సీనియర్ నటుడు గోపరాజు రమణ, పుష్ప ఫ్రేమ్ జగదీష్ బండారి తదితరులు కీలక పాత్రలు పోషించారు. గీతా ఆర్ట్స్ 2, మహాయణ మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎటాచ్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రానికి వాజిద్ బేగ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఈ మూవీతో పాటు రామ్ పసుపులేటి దర్శకత్వంలో ఆనందరావు అడ్వెంచర్స్ అనే చిత్రంలోనూ నటిస్తున్నారు సుహాస్.