Begin typing your search above and press return to search.

అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్.. ఫన్ అండ్ సీరియస్​ మోడ్​

విలేజ్​ బ్యాక్​డ్రాప్​లో సాగే ఈ కథలో.. సుహాస్​ సీరియస్​ యాక్టింగ్​తో పాటు ఫైటింగ్ సీన్స్ కూడా చేశారు​.

By:  Tupaki Desk   |   9 Oct 2023 12:05 PM GMT
అంబాజీపేట మ్యారేజి బ్యాండు టీజర్.. ఫన్ అండ్ సీరియస్​ మోడ్​
X

కలర్‌ఫొటో, రైటర్‌ పద్మభూషణ్‌ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్‌ నేచురల్​ యాక్టర్‌ సుహాస్. ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం నటిస్తున్న తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. దుశ్యంత్‌ కటికినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్​గా ఈ మూవీ నుంచి లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ సినీ ప్రియులను ఆకట్టుకోగా.. ఇప్పుడు సౌండ్ దద్దరిల్లిపోతుంది.. అంటూ టీజర్​ను రిలీజ్ చేశారు మేకర్స్​.


చెప్పవే చిరునామా అంటూ బ్యాండ్​ మ్యూజిక్​తో మొదలైన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. మ్యారేజ్‌ బ్యాండ్‌ లీడర్‌ మల్లి క్యారెక్టర్‌లో సుహాస్‌ కనిపించారు. లవ్ స్టోరీ కమ్ ఫన్​ రైడ్​ అండ్​ యాక్షన్​గా సాగిందీ ప్రచార చిత్రం. హీరోహీరోయిన్​ మధ్య కాస్త రొమాంటిక్ కెమిస్ట్రీ కూడా సాగింది.

విలేజ్​ బ్యాక్​డ్రాప్​లో సాగే ఈ కథలో.. సుహాస్​ సీరియస్​ యాక్టింగ్​తో పాటు ఫైటింగ్ సీన్స్ కూడా చేశారు​. చివర్లో ఏదో కోల్పోయి గుండు కూడా గీయించుకున్నట్టు కనిపించారు సుహాస్​. శేఖర్‌ చంద్ర అందించిన మ్యూజిక్​ కూడా ఆకట్టుకుంది.

ఇక ఈ చిత్రంలో పుష్ప ఫేం జగదీశ్‌ ప్రతాప్‌ బండారి, గోపరాజు రమణ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్‌ 2, మహాయణ మోషన్ పిక్చర్స్‌, ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.మహాయానా మోషన్ పిక్చర్స్ అనేది డైరెక్టర్ వెంకటేశ్ మహాకు చెందిన నిర్మాణ సంస్థ కావడం విశేషం. ఇంకా ఈ చిత్రానికి సంగీతం - శేఖర్‌ చంద్ర అందిస్తుండగా.. సినిమాటోగ్రఫీ - వాజిద్‌ బేగ్‌ అందిస్తున్నారు.

కాగా, ఈ మధ్యే రైటర్ పద్మభూషణ్ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న సుహాస్... లోబడ్జెట్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను అందుకుంటున్నాడు. అందుకే సుహాస్ చేస్తున్న సినిమాలపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ప్రస్తుతం అతడు రామ్‌ పసుపులేటి దర్శకత్వంలో ఆనందరావ్‌ అడ్వంచర్స్ అనే మూవీలో కూడా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ పోస్టర్‌కు మంచి స్పందన కూడా వచ్చింది.