Begin typing your search above and press return to search.

కుర్ర హీరోకి అల్లు అరవింద్ మెగా కాంప్లిమెంట్..!

సుహాస్ శివాని జంటగా దుశ్యంత్ కటికనేని డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు

By:  Tupaki Desk   |   3 Feb 2024 7:26 AM GMT
కుర్ర హీరోకి అల్లు అరవింద్ మెగా కాంప్లిమెంట్..!
X

సుహాస్ శివాని జంటగా దుశ్యంత్ కటికనేని డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా అంబాజీపేట మ్యారేజీ బ్యాండు. ఈ సినిమాను జిఏ 2, ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కలిసి నిర్మించారు. సినిమాలో శరణ్య ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ ఈవెంట్ కి వచ్చారు.

ఈ సక్సెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ సినిమా లో అనవసరమైన యాక్షన్ ఇంకా వేరే ఇతర అంశాలు ఏమి లేకుండా చెప్పిన ప్యూర్ స్టోరీ ఇది. ఈమధ్య కాలంలో ఇలాంటి ఎమోషన్స్ కి ప్రాధాన్యత కలిగిన సినిమా రాలేదని అన్నారు. సిస్టర్ రోల్ లో శరణ్య అద్భుతంగా నటించింది. ఇంటర్వెల్ లో సుహాస్ నటన చూసి ఈ అబ్బాయి ఇంత సహజంగా ఎలా నటిస్తున్నాడని అనిపించింది. మన దగ్గర ఉన్న అతికొద్దిమంది సహజ నటుల్లో సుహాస్ ఒకరని అన్నారు అల్లు అరవింద్.

ఈ సందర్భంగా సుహాస్ మాట్లాడుతూ.. నిన్న శ్రీరాములు థియేటర్ లో సినిమా చూడటం అద్భుతంగా అనిపించింది. సినిమాకు ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం సంతోషంగా ఉంది. నాకు మరో హిట్ చిత్రాన్ని అందించినందుకు ప్రేక్షకులను థాంక్స్. సినిమా చూసేందుకు ఆడియన్స్ థియేటర్ కు రావడం సంతోషంగా ఉందని అన్నారు. సినిమాకు మంచి రివ్యూస్ ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు అన్నారు.

సినిమా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. అంబాజీపేట మ్యారేజి బ్యాడు లాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు థియేటర్ లో చూడాలి. శ్రీరాములు థియేటర్ లో ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకుల స్పందన చూసి చాలా హ్యాపీగా అనిపించిందని అన్నారు.

కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్ సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించిన సుహాస్ ఇప్పుడు అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో కూడా ఆడియన్స్ మెప్పు పొందాడు. సినిమా కథ కచ్చితంగా చెప్పాలంటే రొటీన్ గానే అనిపించినా కథనం నడిపించిన తీరు మెప్పించింది. ఈ సినిమాతో సుహాస్ కెరీర్ లో మరో హిట్ ఖాతాలో వేసుకున్నాడు.