Begin typing your search above and press return to search.

ఆ ఓటీటీ మీట్ వెనుక లెక్కేంటి? ఏం చెప్ప‌బోతున్నారు!

ఈ స్థాయి సమీకరణ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించదు.

By:  Tupaki Desk   |   19 March 2024 1:06 PM GMT
ఆ ఓటీటీ మీట్ వెనుక లెక్కేంటి? ఏం చెప్ప‌బోతున్నారు!
X

ఓటీటీ మార్కెట్ మునుప‌టి కంటే మంద‌కొడిగా సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. మార్కెట్ లో పోటీ పెర‌గ‌డంతో ఓటీటీలు కిందామీదా ప‌డుతున్నాయి. సినిమాలు కూడా తొంద‌ర‌ప‌డి కొన‌లేని ప‌రిస్థితి. జియో సినిమా-డిస్నీ+హాట్ స్టార్ రెండూ వీలిన‌మైన అంశం ఇత‌ర ఓటీటీల‌కు స‌వాల్ గా మారింది. 23 కోట్ల 3 లక్షలు మంది చందాదారులు ఈ గ్రూపు లోకి వ‌చ్చేసారు. ఈ స్థాయి సమీకరణ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కనిపించదు.

రిలయన్స్-డిస్నీ విలీనం భారతదేశంలో వినోద వీక్షణానుభవాన్ని పూర్తిగా మార్చగలదని అంచనా వేస్తున్నారు. ఆయా విలీన సంస్థ‌ల‌తో మిగ‌తా ఓటీటీలు పోటీ ప‌డ‌టం అన్న‌ది సామాన్య‌విష‌యం కాదు. ఎంత భారీ నెట్ వ‌ర్క్ ని క‌లిగి ఉన్నా రిల‌య‌న్స్ ధీటుగా మిగ‌తా సంస్థ‌లు నిల‌బ‌డ‌తాయా? అన్న సందేహాలు సైతం తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఆమెజాన్ ప్రైమ్ వీడియో కొత్త స్ట్రాట‌జీకి తెర తీసిన‌ట్లు తెలుస్తోంది.

ఈనెల 19న అమెజాన్ వాణిజ్య రాజ‌ధాని ముంబైలో భారీ మీట్ ని ఏర్పాటు చేసింది. ఓ క్యూ అండ్ ఏ సెష‌న్ పేరుతో ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుంది. ఈ వెంట్ కి అన్ని సినీ ప‌రిశ్ర‌మ‌ల దిగ్గ‌జాలు..ద‌ర్శ‌క‌-నిర్మాత‌లు..కొద్ది మంది హీరోలు...ముఖ్య‌మైన పారిశ్రామిక వేత్త‌లు...రాజ‌కీయ నాయ‌కులు...దేశంలో ఉన్న అన్నీ మీడియా సంస్థ‌లు హాజ‌ర‌వుతున్నాయి. ఆ రోజు రాత్రి భారీ పార్టీని ఏర్పాటు చేసింది.

టాలీవుడ్ నుంచి ముఖ్య‌మైన వారంతా హాజ‌ర‌వుతున్నారని స‌మాచారం. ఫండ్స్ లేవ‌ని..సినిమాలు కొన‌డం తగ్గించార‌ని ఇప్ప‌టికే ఆమెజాన్ పై ఓ రూమ‌ర్ వైర‌ల్ అవుతోంది. అమెజాన్ లాంటి పెద్ద సంస్థ పై ఇలాంటి రూమ‌ర్ ప‌డే స‌రికి ఒక్క‌సారిగా అలెర్ట్ అయిన‌ట్లు క‌నిపిస్తుంది. పై సందేహాల‌న్నింటిని నివృత్తి చేయ‌డానికే ముంబై లో మీట్ ఏర్పాటు చేసిన‌ట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇత‌ర ఓటీటీ ల‌తో అమెజాన్ ఎలా పోటీ పడ‌బోతుంది? మార్కెట్ లో అమెజాన్ రేంజ్ ని ఈవెంట్ లో చాటిచెప్పే అవ‌కాశం ఉంది. మ‌రి అత్య‌వ‌స‌ర మీట్ వెనుక అస‌లు సంగ‌తి ఏంటి? అన్న‌ది 19న క్లారిటీ వ‌స్తుంది.