Begin typing your search above and press return to search.

యూత్‌కి గాలం వేయ‌డానికి ఓటీటీ ఎత్తుగ‌డ‌

ఇటీవ‌లే ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం ప్రైమ్ వీడియోస్ భారీ ప్రకటన చేసింది. తాము రిలీజ్ కి సిద్ధం చేస్తున్న ఒరిజిన‌ల్ కంటెంట్ గురించి వెల్లడించింది

By:  Tupaki Desk   |   20 March 2024 2:34 PM GMT
యూత్‌కి గాలం వేయ‌డానికి ఓటీటీ ఎత్తుగ‌డ‌
X

ఓటీటీ రంగంలో పోటీ గురించి తెలిసిందే. దిగ్గ‌జ కార్పొరెట్ కంపెనీలు వంద‌ల వేల కోట్ల పెట్టుబ‌డుల‌తో ఓటీటీ రంగంలో స‌త్తా చాటుతూ ముందుకు దూసుకెళుతున్నాయి. స్మార్ట్ యుగంలో వినోదం ఓటీటీల చేతికి చిక్కింది. ముఖ్యంగా యువ‌త‌రానికి ఓటీటీ గొప్ప వెసులుబాటు సాధ‌నం. అందుకే ఈ రంగం దిన‌దినాభివృద్ధి చెందుతోంది.

ఇటీవ‌లే ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం ప్రైమ్ వీడియోస్ భారీ ప్రకటన చేసింది. తాము రిలీజ్ కి సిద్ధం చేస్తున్న ఒరిజిన‌ల్ కంటెంట్ గురించి వెల్లడించింది. ఇందులో సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డిజిటల్ డైరెక్ట్ రిలీజ్ సినిమాలు...టాక్ షోలు ఉన్నాయి. హరి హర వీర మల్లు, గేమ్ ఛేంజర్, ఫ్యామిలీ స్టార్, తమ్ముడు, ఓం భీమ్ బుష్ సినిమాలు ఈ వేదిక‌పైనే స్ట్రీమింగ్ కానున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ ని అమెజాన్ ప్రైమ్ ఛేజిక్కించుకుంది.ఇరుగు పొరుగు భాష‌ల నుంచి భారీ చిత్రాలు కాంతరా: అధ్యాయం 1, త్వ‌ర‌లో రానున్న సూర్య కంగువ చిత్రాలు కూడా ఉన్నాయి. హిందీ నుండి డాన్ 3, సిద్ధార్థ్ మల్హోత్రా యోధా, తేరీ వ‌త‌న్ మే ఉల్జా జియా, ఇక్కిస్, స్త్రీ 2, అశ్వత్థామ, షూజిత్ సిర్కార్ కొత్త సినిమా, సాంకీ, బాఘీ 4, హౌస్‌ఫుల్ 5, చందు ఛాంపియన్, గ్రౌండ్ జీరో, బ్యాడ్ న్యూజ్, యుద్ర, అగ్ని, సింగం 3 ఇలా ప‌లు చిత్రాలు స్ట్రీమ్ అవుతాయి. ప్రైమ్ వీడియో ఒరిజిన‌ల్స్ లో వతన్ మేరే వతన్, చోరీ 2, సుబేదార్, సూపర్‌మెన్ ఆఫ్ మాలెగాన్, బీ హ్యాపీ, ది మెహతా బాయ్స్, ఉప్పు కప్పురంబు వంటి చిత్రాలు ఉన్నాయి.

వెబ్ సిరీస్‌ల విష‌యానికి వ‌స్తే... సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్, ది ఫ్యామిలీ మ్యాన్ S3, మీర్జాపూర్ S3, పంచాయత్ S3, పాతాళ్‌ లోక్ S2, బండిష్ బాండిట్స్ S2, మా కా సమ్, వాక్ గర్ల్స్, జిడ్డీ గర్ల్స్, బ్యాండ్ వాలే, దిల్ దోస్తీ డైలమా, ఫాలో కర్ లో యార్, ది ట్రైబ్, కాల్ మి బే, డేరింగ్ పార్ట్‌నర్స్, ఇన్ ట్రాన్సిట్, అంధేరా, దల్డాల్, ది రివల్యూషనరీస్, ఖౌఫ్, ది గ్రేట్ ఇండియన్ కోడ్, రంగీన్, మట్కా కింగ్, దుపాహియా, అరేబియా కడలి, ధూత 2, శివరాపల్లి , ఇన్‌స్పెక్టర్ రిషి, గ్యాంగ్స్-కురుతి పునల్, సుజల్ ది వోర్టెక్స్ S2, తలైవెట్టియాన్ పాలయం, ఫాల్అవుట్ లాంటి భారీ సిరీస్ లు స్ట్రీమింగ్ కావ‌డం ఆస‌క్తిక‌రం. ది రానా క‌నెక్ష‌న్ పేరుతో తెలుగు టాక్ షోని ప్రారంభించ‌నున్నారు.