ప్రహసనంగా ప్రైమ్ వీడియో కొత్త రూల్!
అమెజాన్ ప్రైమ్ వీడియోపై వినియోగాదారులు మండిపడుతున్నారు. మీరు తీసుకొచ్చిన కొత్త విధానం చెత్తగా ఉందని, మా సహనాన్ని పరీక్షిస్తోందని ఫైర్ అవుతున్నారు.
By: Tupaki Desk | 12 Jun 2025 10:30 AMఅమెజాన్ ప్రైమ్ వీడియోపై వినియోగాదారులు మండిపడుతున్నారు. మీరు తీసుకొచ్చిన కొత్త విధానం చెత్తగా ఉందని, మా సహనాన్ని పరీక్షిస్తోందని ఫైర్ అవుతున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా 2 డివైజ్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒక అకౌంట్ తీసుకుని దాన్ని చాలా మంది స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేస్తుండటంతో అలర్ట్ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియో 2 డివైజ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.
అయితే అమెజాన్ ప్రైమ్ తీసుకొచ్చిన ఈ విధానం కొత్త సమస్యలు తెచ్చిపెడుతోంది. ఒక డివైజ్‌లో లాగిన్ అయి సినిమా చూసిన తరువాత మరో సారి లాగిన్ అయితే రిజెక్ట్ చేస్తోంది. ఇదే ఇప్పుడు కొత్త సమస్యలకు కారణంగా మారుతోంది. వినియోగదారుల సహనాన్ని పరీక్షిస్తూ అమెజాన్ ప్రైమ్ వర్గాలపై ఫైర్ అయ్యేలా చేస్తోంది. తాజాగా ఓ సబ్స్‌స్క్రైబర్ ఈ సమస్యని సోసల్ మీడియా వేదికగా వెలుగులోకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
వినియోగదారుడు తాజా సమస్యను వివరిస్తూ సోషల్ మీడియా వేదికగా ఓ స్క్రీన్ షాట్‌ను షేర్‌చేశాడు. ఒకే డివైజ్‌లో లాగిన్ అయి లాగౌట్ అయ్యాక ఆ డివైజ్‌లో మరో సారి లాగిన్ అవుతుంటే ఇది మీరు రిజిస్టర్ చేసుకున్న డివైజ్ కాదంటూ రిజెక్ట్ చేస్తోంది. ఆ సమస్యకు పరిష్కారం ఏంటని సదరు వినియోగదారుడు సోషల్ మీడియా వేదికగా అమెజాన్ ప్రైమ్ వీడియో వర్గాలని ప్రశ్నించాడు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోకు ప్రపంచ వ్యాప్తంగా 220 మిలియన్‌ల సబ్స్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇంతటి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ ప్లాట్ ఫామ్ తాజా విధానంతో కొత్త ఇబ్బందుల్ని ఎదుర్కోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 2 డివైజ్ విధానంలో ఏర్పడుతున్న సాంకేతిక కారణాల వల్ల ఈ ఫ్లాట్ ఫామ్‌కు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, ఇదే సమస్య పునరావృతం అవుతూ ఉంటే సబ్స్‌స్క్రైబర్స్ భారీ స్థాయిలో అమెజాన్ ప్రైమ్ వీడియోని వీడతారని పలువురు హెచ్చరిస్తున్నారు. అంతే కాకుండా ఇదొక స్టుపిడ్ పద్దతని, దీని కారణంగా ఈ సంస్థ భారీగా నష్టపోవడం ఖాయమని సబ్స్‌స్క్రైబర్స్ కామెంట్‌లు చేస్తున్నారు. మరి అమెజాన్ ప్రైమ్ దీనిపై వెనక్కి తగ్గుతుందా? లేక మొండిగా ముందుకు వెళ్లి కోరి ఇబ్బందుల్ని కొని తెచ్చుకుంటుందో వేచి చూడాల్సిందే.