Begin typing your search above and press return to search.

కాబోయే మ‌మ్మీ అమ‌లా పాల్ ముక్కుపైకి జారిందేమిటి?

ఈ స‌మ‌యంలో భ‌ర్త‌తో క‌లిసి ఎంతో హ్యాపీగా గ‌డిపేస్తున్న ఈ బ్యూటీ.. బేబి బంప్‌తో ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను అప్ డేట్ చేస్తోంది.

By:  Tupaki Desk   |   13 May 2024 3:25 PM GMT
కాబోయే మ‌మ్మీ అమ‌లా పాల్ ముక్కుపైకి జారిందేమిటి?
X

మాతృత్వాన్ని స్వీకరించిన న‌టి అమలా పాల్ ఆనందకరమైన ప్రయాణానికి సంబంధించి వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేస్తోంది. ఈ స‌మ‌యంలో భ‌ర్త‌తో క‌లిసి ఎంతో హ్యాపీగా గ‌డిపేస్తున్న ఈ బ్యూటీ.. బేబి బంప్‌తో ఉన్న ఫోటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌ను అప్ డేట్ చేస్తోంది.


తాజాగా మ‌రో రేర్ క్లిక్ ని అమ‌లాపాల్ షేర్ చేసింది. ఇందులో పాల్ పూర్తిగా వైట్ అండ్ వైట్ డిజైన‌ర్ లాంగ్ ఫ్రాక్ లో క‌నిపించింది. కాస్త లూజ్ గా ఉన్న‌ వైట్ ఫ్రాక్‌లో బేబి బంప్ స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. దానికి మించి ఈ ఫోటోగ్రాఫ్ లో ఒక ప్ర‌త్యేక‌త ఉంది. అమ‌లాపాల్ ఒక ప్ర‌త్యేక‌మైన ఆభ‌ర‌ణాన్ని త‌న ముఖంపై ధ‌రించిన తీరు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. నుదుటిన ఉండాల్సిన పాపిడి బొట్టు ముక్కు పైకి జారితే ఎంతందంగా ఉంటుందో దీనిని చూస్తే అర్థ‌మ‌వుతోంది. అమ‌లా ఏం చేసినా చాలా ప్ర‌త్యేకంగా ఉంటుందంటూ ఈ ఆభ‌ర‌ణాన్ని చూసి కితాబిచ్చేస్తున్నారు ఫ్యాన్స్.


కాబోయే మ‌మ్మీ రోజురోజుకు షైన్ అవుతోంది. ఆ గ్లో త‌న ముఖంలో స్ప‌ష్ఠంగా క‌నిపిస్తోంది. దానికి తోడు తొమ్మిది నెల‌ల‌ నిండు గ‌ర్భిణి రేపో మాపో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్న కాబోయే మామ్ ఇంతందంగా ఆనందంగా ఉల్లాసంగా గ‌డుపుతుండ‌డం అభిమానుల‌కు ఆనందాన్నిస్తోంది.


అమాలా పాల్ - జగత్ దేశాయ్ గత ఏడాది నవంబర్‌లో కేరళలోని కొచ్చిలో వివాహం చేసుకున్నారు. తన పెళ్లి తర్వాత కేవలం రెండు నెలల తర్వాత మరొక ఆశ్చర్య‌క‌ర విష‌యం చెప్పింది. అమ‌లా తాను తొలి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చేందుకు ఎదురుచూస్తున్నట్లు ప్రకటించింది. వారిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నార‌ని స్పష్ఠ‌త వ‌చ్చింది. వ‌రుస‌ ఫోటోషూట్‌ల నుండి ఆనందకరమైన విహారయాత్రల వరకు అమ‌లా త‌న భ‌ర్త‌తో సమయాన్ని అద్భుతంగా గడుపుతోంది. సామాజిక మాధ్య‌మాల్లో తరచుగా తన భర్తతో సంతోషకరమైన క్షణాలకు సంబంధించిన ఫోటోల‌ను అమ‌లాపాల్ షేర్ చేస్తోంది. అమల త‌న‌కు పాప పుట్టాల‌ని ఆశ పడుతుండగా, త‌న‌ భర్త అబ్బాయి జ‌న్మించాల‌ని కోరుకుంటున్న‌ట్టు ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మలయాళ చిత్రం ఆడుజీవితంలో అమ‌లాపాల్ కనిపించింది. బ్లెస్సీ దర్శకత్వం వహించిన సర్వైవల్ డ్రామా చిత్రం బెన్యామిన్ రాసిన న‌వ‌ల‌ ఆధారంగా రూపొందింది. సుదూర ఎడారి పొలాలలో మేకల కాపరిగా పని చేస్తూ సౌదీ అరేబియాలో బానిసత్వంలో చిక్కుకున్న నజీబ్ అనే మలయాళీ వలస కార్మికుడి క‌థ‌తో ఈ సినిమా రూపొందింది. ఇది రియ‌లిస్టిక్ వ్యక్తి నుండి ప్రేరణ పొందిన క‌థ‌. మనుగడకు సంబంధించిన ఒక అద్భుతమైన కథ. అమలపాల్ మేక‌ల కాప‌రి భార్య పాత్రను పోషించింది. త‌దుప‌రి ద్విజ , లెవెల్ క్రాస్ అనే మరో రెండు మలయాళ చిత్రాలలో కూడా కనిపించనుంది.