Begin typing your search above and press return to search.

డెలివ‌రీ ముందు అమ‌లాపాల్ షాక్‌లు

ఇప్పుడు డెలివరీ తేదీ దగ్గర పడుతుండగా అమ‌లా తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ ఆన్‌లైన్‌లో ఒక‌ వీడియోను షేర్ చేసింది.

By:  Tupaki Desk   |   9 Jun 2024 4:30 AM GMT
డెలివ‌రీ ముందు అమ‌లాపాల్ షాక్‌లు
X

విల‌క్ష‌ణ‌మైన క‌థ‌లు, వైవిధ్య‌మైన పాత్ర‌ల ఎంపిక‌ల‌తో సౌత్ స్టార్ హీరోయిన్ అమ‌లాపాల్ ఎప్పుడూ ఆశ్చర్య‌ప‌రుస్తూనే ఉంది. బోల్డ్ పెర్ఫామ‌ర్ గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు ఉంది. న‌టిగా ఇత‌ర భామ‌ల కంటే అమ‌లాపాల్ ఎప్పుడూ ప్ర‌త్యేకం అని నిరూపించింది. అమ‌లాపాల్ గ‌ట్సీ పెర్ఫామెన్సెస్ కి అవార్డులు రివార్డులకు కొద‌వేమీ లేదు.

కేవలం వృత్తిగ‌త జీవితంలోనే కాదు.. వ్య‌క్తిగ‌తంగాను అమ‌లాపాల్ ఎక్స్ పెరిమెంట‌ల్. ఇప్పుడు మొద‌టి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చేందుకు రెడీ అవుతున్న అమ‌లాపాల్ గాల్లో తేల్తోంది. ఈ ఆనంద స‌మ‌యాన ఎంతో ఫ‌న్ తో ఆక‌ట్టుకుంటోంది. అమలా పౌలా - జగత్ దేశాయ్ త‌మ మొద‌టి బిడ్డ గురించి చాలా ఉత్కంఠ‌గా వేచి చూస్తున్నారు. అమ‌లాపాల్ గ‌ర్భిణిగా ఈ ప్రయాణంలో కొత్త అధ్యాయాన్ని ఆస్వాధిస్తున్నాన‌ని తెలిపింది. తన బేబీ బంప్‌తో చాలా అరుదైన‌ క్షణాలను క్యాప్చర్ చేస్తూ సోషల్ మీడియాల్లో అభిమానుల‌కు వాటిని షేర్ చేస్తోంది.

ఇప్పుడు డెలివరీ తేదీ దగ్గర పడుతుండగా అమ‌లా తన బేబీ బంప్‌ను ప్రదర్శిస్తూ ఆన్‌లైన్‌లో ఒక‌ వీడియోను షేర్ చేసింది. ఇన్‌స్టా వీడియోలో అమ‌లాపాల్ డ్యాన్సులు చేస్తూ క‌న‌బ‌డింది. ''బేబీ కమ్ డౌన్ కమ్ డౌన్ పాడే సమయం వచ్చింది'' అనే క్యాప్షన్ తో త‌న‌లోని ఫ‌న్ యాంగిల్ ని చూపించింది పాల్. అమలా పాల్ మే 8న తన తొమ్మిదో నెల గర్భంలోకి ప్రవేశించింది. అంటే ఈ జంటకు డెలివరీ తేదీ ద‌గ్గ‌ర‌లో ఉంది. అమ‌లా ప్రసవం సాఫీగా జరగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ప్రెగ్నెన్సీ కారణంగా నటనకు విరామం తీసుకున్నప్పటికీ అమలా పాల్ న‌టించిన ఓ భారీ సినిమా ఈ ఏడాది థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం బ్లెస్సీ దర్శకత్వం వహించిన ఆడుజీవితం. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య‌ నజీబ్ గా న‌టించింది. ఈ సినిమా బ్లాక్ బస్ట‌ర్ విజ‌యం సాధించింది. తదుపరి మలయాళ చిత్రం 'లెవెల్ క్రాస్‌'లో అమ‌లా కనిపిస్తుంది. దీనికి అర్ఫాజ్ అయూబ్ దర్శకత్వం వహించారు . ఆసిఫ్ అలీ -షరాఫుద్దీన్ ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా టీజర్ కొద్ది రోజుల క్రితం విడుదలై నెటిజన్ల నుంచి మంచి ఆదరణ పొందింది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్ట్ 2024లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.