Begin typing your search above and press return to search.

బేబి బంప్ తో అమ‌లాపాల్ స‌ర్ ప్రైజ్!

ఓ పోస్ట్ ని షేర్ చేస్తూ అమ‌ల ఇలా రాసుకొచ్చారు. 'నేను ఇప్పుడు నీతో కలిసి ముగ్గురు కాబోతున్నాము' అంటూ తెలిపారు.

By:  Tupaki Desk   |   9 Jan 2024 6:32 AM GMT
బేబి బంప్ తో అమ‌లాపాల్ స‌ర్ ప్రైజ్!
X

అమ‌లాపాల్ రెండ‌వ పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. బోయ్ ప్రెండ్ జ‌గ‌త్ దేశాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్ద‌రి వివాహం న‌వంబ‌ర్ 5న నిరాడంబ‌రంగా జ‌రిగింది. అయితే పెళ్లైన రెండు నెల‌ల‌కే ఈ జోడీ త‌ల్లిదండ్రువుతున్నారు. అవును తాజాగా అమ‌లాపాల్ బేబి బంప్ ఫోటోలు..వీడియోలు కొన్నింటిని ఇన్ స్టాలో షేర్ చేసి తాను త‌ల్లి అవుతున్న‌ట్లు అధికారికంగా రివీల్ చేసింది.

ప్రేమ విషయాన్ని ఎంత వేగంగా చెప్పారో? పెళ్లి ఎంత వేగంగా జ‌రిగిందో? త‌ల్లిదండ్రులుగా కూడా అంతే వేగంగా ప్ర‌మోట్ అవ్వ‌డం విశేషం. ఓ పోస్ట్ ని షేర్ చేస్తూ అమ‌ల ఇలా రాసుకొచ్చారు. 'నేను ఇప్పుడు నీతో కలిసి ముగ్గురు కాబోతున్నాము' అంటూ తెలిపారు. ఓసారి తాజా ఇన్ స్టారీల్స్ చూస్తే అమ‌లాపాల్ బేబి బంప్ తో చిల్ అవుతోన్న మూవ్ మెంట్స్ ని షేర్ చేసుకుంది. భ‌ర్త‌తో క‌లిసి ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో అమె కెమెరాకి ఫోజులిచ్చారు.

ఇద్ద‌రి మ‌ధ్య అన్యోన్య‌త‌ని ఈ ఫోటో షూట్ తెలియ‌జేస్తుంది. ఇద్ద‌రు ఎంతో స‌ర‌దాగా ఆ క్ష‌ణాల్ని గ‌డుపుతు న్నారు. అమ‌ల గ‌ర్భిణి కావ‌డంతో భ‌ర్త ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడు..ఎంత ప్రేమ‌గా చూసుకుంటు న్నాడు? అన్న‌ది ఇందులో రివీల్ చేసారు. ఎత్తైన పొట్ట‌పై జ‌గ‌త్ చేతులు పెట్టి లోప‌ల బేబిని ప‌రిశీ లించ‌డం ..అది చూసి అమ‌లాపాల్ సంతోష ప‌డటం ప్ర‌తీ మూవ్ మెంట్ ని ఎంతో అందంగా క్యాప్చ‌ర్ చేసారు.

ఆ ప్రేమ‌ని తెలియ‌జేస్తూ బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవ‌ర్...మ‌ధ్య మ‌ధ్య‌లో అమ‌పాల్ అంద‌మైన స్టెప్పు ల‌తోనే అల‌రించింది. ప్ర‌స్తుతం ఈ రీల్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ జోడీకి అభిమానులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. అంద‌మైన జోడీ మ‌ధ్య‌లో అంత‌కు మించి అంద‌మైన బేబి రాబోతుందంటూ నెటిజ నులు విషెస్ తెలుపుతున్నారు.