గర్భిణి అయ్యాకే భర్తకు నటి అని చెప్పిందట
బోల్డ్ డెసిషన్స్ తో ఇతర కథానాయికల కంటే తాను భిన్నమైన నటి అని నిరూపించింది అమలా పాల్.
By: Tupaki Desk | 11 May 2025 7:30 PMబోల్డ్ డెసిషన్స్ తో ఇతర కథానాయికల కంటే తాను భిన్నమైన నటి అని నిరూపించింది అమలా పాల్. కెరీర్ ఆరంభమే మృగం లాంటి ప్రయోగాత్మక చిత్రంలో బోల్డ్ నటనతో యూత్ కి కిక్కిచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత టాలీవుడ్ అగ్ర హీరోల సరసనా కథానాయికగా నటించింది. `ఆమె` అనే సినిమాలో పూర్తి నగ్నంగా కనిపించి అమలా పెద్ద షాకిచ్చింది.
దర్శకుడు విజయ్ తో పెళ్లి బంధం బ్రేక్ అయ్యాక చాలా కాలం సినిమాలకు దూరమైంది. విడాకుల అనంతరం ఒంటరిగా ఉన్న అమలాపాల్ జగత్ అనే గోవాకు చెందిన వ్యాపారిని పెళ్లాడింది. జగత్ తో డేటింగ్ చేస్తున్నప్పుడు తాను నటి అనే విషయం అతడికి తెలియదని.. తాను గర్భం దాల్చిన తర్వాతే తెలిసిందని అమలా పాల్ చెప్పింది. JFW మూవీ అవార్డ్స్‌లో ఉత్తమ నటిగా క్రిటిక్స్ అవార్డును స్వీకరించిన అమలా వేదికపై ఈ షాకింగ్ విషయం చెప్పింది. ఫ్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యాక, అతడు తన సినిమాలను చూడటం ప్రారంభించాడని, అవార్డు వేడుకలను ఇష్టంగా చూస్తాడని అమలాపాల్ వెల్లడించింది.
గుజరాత్ నుంచి వచ్చి గోవాలో స్థిరపడిన వ్యాపారి అతడు. మేం గోవాలో కలుసుకున్నాం. నేను కేరళ నుంచి వచ్చానని అతడికి చెప్పాను. స్వతహాగా అతడికి దక్షిణాది సినిమాలు చూసే అలవాటు లేదు. నేను నటిని అని అతడికి అప్పట్లో చెప్పలేదు. అతనికి ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు యాక్సెస్ ఇచ్చాను. తరువాత నేను గర్భవతి అని నాకు తెలిసింది. మేము వెంటనే వివాహం చేసుకున్నాము అని తెలిపింది. గర్భధారణ సమయంలో జగత్ తాను నటిని అనే విషయం తెలసుకున్నాడు. నా కీర్త ప్రతిష్ఠల గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయేవాడు. బిడ్డ కోసం మేం ఇంట్లో ఉన్నప్పుడు అతడు నా సినిమాల్ని చూసాడు. నేను అవార్డులు అందుకోవడం, రెడ్ కార్పెట్ మీద నడవడం.. వేదికపై మాట్లాడటం చూడటం అతడిని నిజంగా ఆశ్చర్యపరిచింది అని అమలా చెప్పింది. నేను రెడ్ కార్పెట్ ఈవెంట్లలో ఒకటి చూస్తానని కూడా నన్ను అడిగాడు అని తెలిపింది. 2024లో అమలాకు మగ బిడ్డ పుట్టాడు. ఇలై అని పేరు పెట్టుకున్నారు. నీల తామర అనే మలయాళ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన అమలాపాల్ 2024 లో, మలయాళ చిత్రాలు ఆడుజీవితం - ది గోట్ లైఫ్ , లెవెల్ క్రాస్ లలో నటించింది. ఇప్పుడు ద్విజ అనే చిత్రంలో నటిస్తోంది.