కొడుకుని మతంలోకి దించిన బ్యూటీఫుల్ మామ్!
బాప్టిజం ద్వారా ఒక వ్యక్తి పాపాలని కడిగి దేవుని సేవకుడిగా గుర్తిస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
By: Tupaki Desk | 25 May 2025 7:00 PM ISTఅమలాపాల్ వృత్తి-వ్యక్తిగత జీవితం సంతోషంగా సాగిపోతుంది. అవకాశాల పరంగా అమ్మడి లైనప్ బాగుంది. తెలుగులో సినిమాలు చేయలేదు కానీ తమిళ్..మాలీవుడ్ లో మాత్రం బిజీగానే ఉంది. గ్యాప్ లేకుండా ఏడాదికి రెండు సినిమాలతోనైనా ప్రేక్షకుల మధ్యలో ఉంటుంది. జగత్ దేశాయ్ ని రెండవ వివాహం అనంతరం ధాంపత్య జీవితంలోనూ సంతోషమే. ఆ దంపతులకు గత ఏడాది జూన్ లో ఓ మగబిడ్డ కలిగాడు.
ఆ బిడ్డ ఏడాదికి చేరువయ్యాడు. ఇలా సినిమాలు కొడుకును చూసుకుంటూ అమలాపాల్ కెరీర్ ని బ్యాలెన్స్ చేస్తుంది. జగత్ దేశాయ్ నుంచి అన్ని రకాలుగా మద్దతు లభించడంతో? కెరీర్ సంతోషంగా సాగిపోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా కుమారుడిని క్రైస్తవ మతంలోకి మార్పిస్తున్నట్లు అమలాపాల్ తెలిపింది. ప్రేమ శాంతితో కూడిన ఇలై బాప్టిజం జరుపుకున్నట్లు వెల్లడించింది. బాప్టిజం అంటే క్రైస్తవ మతంలోకి మారడం.
బాప్టిజం ద్వారా ఒక వ్యక్తి పాపాలని కడిగి దేవుని సేవకుడిగా గుర్తిస్తుంది. దానికి సంబంధించిన కొన్ని ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా అమలాపాల్ దంపతులకు నెటి జనులు విషెస్ తెలియజేస్తున్నారు. కుమారుడు అచ్చంగా అమలాపాల్ పొలికలతో పుట్టినట్లు కని పిస్తున్నాడు. అమ్మ పొలికలతో అచ్చు దిగాడు. కుమారుడితో డాడ్ ఆడుకుంటోన్న ఫోటోలు కూడా చూడొచ్చు.
క్యూట్ గా ఉన్నాడంటూ నెటిజనులు పోస్టులు పెడుతున్నారు. కుమారుడు పుట్టి ఏడాది సమీపిస్తున్నా? ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. ఇప్పటి వరకూ కుమారుడిని సీక్రెట్ గానే ఉంచింది. బాప్టిజం తీసుకున్న సందర్భంగా ఇలా బయటకు తీసుకొచ్చింది. ప్రస్తుతం అమలాపాల్ మాలీవుడ్ లో `దివిజ` అనే చిత్రంలో నటిస్తోంది.
