త్రో బ్యాక్ తో కూడా ఇలా లాంచ్ చేస్తారా?
డిసెంబర్ వచ్చేసిందంటే 2023కి ముగింపు పలికినట్లే. అందుకే బాలీవుడ్ భామా మణులంతా డిసెంబర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసి డిసెంబర్ 1వతేదిన కొత్త ఫోటోలతో అభిమానుల్ని అలరించారు.
By: Tupaki Desk | 9 Dec 2023 5:30 PMడిసెంబర్ వచ్చేసిందంటే 2023కి ముగింపు పలికినట్లే. అందుకే బాలీవుడ్ భామా మణులంతా డిసెంబర్ ని గ్రాండ్ గా లాంచ్ చేసి డిసెంబర్ 1వతేదిన కొత్త ఫోటోలతో అభిమానుల్ని అలరించారు. ఎవరి స్టైల్లో వారు డిసెంబర్ కి వెల్కమ్ చేసారు. దాదాపు బాలీవుడ్ సెలబ్రిటీలంతా ఈ నెలని ఎంతో గ్రాండ్ గా వెల్కమ్ చెప్పే సారు. అప్పుడే తొమ్మిదవ తేది కూడా వచ్చేసింది. నెల పూర్తవ్వడానికి ఇంకా కొన్ని రోజులే సమయం ఉంది. మరో వారం రోజులు పోతే 2023 రివ్యూలు సైతం తెరపైకి వచ్చేస్తాయి.
కానీ నేను మాత్రం కాస్త డిఫరెంట్ గురూ అంటూ అమైరా దస్తూర్ ఇలా డిసెంబర్ ని త్రోబ్యాక్ తో లాంచ్ చేసింది. ఇదిగో ఇక్కడ కనిపిస్తోన్న పిక్ పాతది. గత డిసెంబర్ లో ఎప్పుడో అమ్మడు ఫోజు ఇచ్చింది. ఆ ఫోటోని ఇప్పుడు పోస్ట్ చేసి `వన్స్ అపాన్ యే డిసెంబర్` అని రాసుకొచ్చింది. పిక్ పాతదే అయినా అమైరా అందంతో మాత్రం కవ్వించేస్తుందండోయ్. బ్లాక్ కలర్ లెహంగాలో అమ్మడు వావ్ అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఇక అమైరా కెరీర్ సంగతి చూస్తే అవకాశాలు కనుచూప మేర కనిపించలేదు. చివరిగా తమిళ్ లో `భగీర` అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఛాన్సు రాలేదు. కొన్ని వెబ్ సిరీస్ లు చేసింది గానీ అక్కడా కలిసి రాలేదు. నత్తనడకనే కెరీర్ సాగుతుంది. ఇక తెలుగులో అదృష్టాన్ని చాలా కాలం క్రితం పరీక్షించుకుంది. `మనసుకు నచ్చింది`...`రాజుగాడు` లాంటి సినిమాలు చేసింది గానీ కలిసి రాలేదు. ఆ తర్వాత ఇక్కడ అవకాశాలు రాలేదు.
కొత్త ఛాన్సులేవైనా వస్తాయా? అని ఎదురు చూస్తుంది. ఆ రకంగా ప్రయత్నాలు మాత్రం సీరియస్ గానే సాగిస్తోంది. ఉన్న పరిచయాలన్నింటిని వినియోగిస్తున్నట్లు సమాచారం. మేనేజర్లు..కోఆర్డినేటర్లకు రెగ్యులర్ గా టచ్ లో ఉంటుందిట. ప్రస్తుతం కోలీవుడ్ లోనే సీరియస్ గా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అమ్మ డి చివరి సినిమా కూడా కోలీవుడ్ నుంచే రిలీజ్ అయింది.