Begin typing your search above and press return to search.

అంబానీ పెళ్లిలో జాన్వీ.. క‌పూర్‌ పార్టీలో అంబానీ?

దేవ‌ర` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న జాన్వీ క‌పూర్ తెలుగు లోగిళ్ల‌లో గొప్ప అభిమానం సంపాదించుకుంటోంది.

By:  Tupaki Desk   |   15 April 2024 3:00 AM GMT
అంబానీ పెళ్లిలో జాన్వీ.. క‌పూర్‌ పార్టీలో అంబానీ?
X

దేవ‌ర` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతున్న జాన్వీ క‌పూర్ తెలుగు లోగిళ్ల‌లో గొప్ప అభిమానం సంపాదించుకుంటోంది. త‌దుప‌రి జ‌గ‌దేక వీరుని వార‌సుడైన రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌నా జాన్వీ న‌టించేస్తోంది. అన్నీ కుదిరితే జ‌గ‌దేక‌వీరుడు అతిలోక సుంద‌రి సీక్వెల్‌లోనూ చ‌ర‌ణ్ స‌ర‌స‌న‌ జాన్వీకే ఛాన్సుంది. క‌పూర్ గాళ్ జాన్వీ న‌టించేవ‌న్నీ పాన్ ఇండియా లెవ‌ల్లో రిలీజ‌య్యే చిత్రాలే. ఇలాంటి క్రేజీ టైమ్ లో జాన్వీ ఇంట్లో జ‌రిగిన ఓ పార్టీలో అంబానీ కూతురు ఇషా అంబానీ, కోడ‌లు శ్లోకా అంబానీ, కుమారుడు అనంత్ అంబానీ పార్టీ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు టాలీవుడ్ వ‌ర్గాల్లోను వైర‌ల్ గా మారుతున్నాయి.


ఇషా అంబానీ, అనంత్ అంబానీ, శ్లోకా మెహతా శనివారం రాత్రి ముంబైలో దిల్జిత్ దోసాంజ్ కచేరీకి హాజరైన తర్వాత జాన్వీ కపూర్ ఇంటికి చేరుకున్నారు. ముంబై రిచెస్ట్ సెల‌బ్రిటీలంతా జాన్వీ ఇంటి వెలుపల వారి కార్లలో కనిపించారు. జాన్వీ నివాసం లో పార్టీకి వీరంతా డిజైన‌ర్ దుస్తుల్లో దిగారు. అనంత్ యానిమ‌ల్ ప్రింట్ ఉన్న నీలిరంగు చొక్కా ధరించాడు. ఇషా మాత్రం పింక్ దుస్తుల్లో అందంగా కనిపించింది. శ్లోకా కూడా గులాబీ రంగు దుస్తులలో ఉంది. అదే కారులో ఇషా పక్కన కూర్చొని ఈ ఫోటోలు తీయడం విశేషం. అనంత్ అంబానీ రాయ‌ల్ గా కార్ల పరివారంతో ప్రత్యేక కారులో వచ్చాడు. పార్టీలో అంబానీ కుటుంబ కిడ్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఫోటోగ్రాఫ‌ర్లు, అభిమానులు సోష‌ల్ మీడియా పేజీలలో షేర్ చేసారు.

అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో జాన్వీ

గ‌త మార్చిలో జామ్‌నగర్‌లో అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ పార్టీలో జాన్వీ - రిహన్న డ్యాన్స్ ల‌ను ఇంకా అభిమానులు మ‌ర్చిపోలేదు. మూడు రోజుల అంబానీ ఉత్సవాల్లో మొదటి రోజున రిహాన్న‌తో క‌లిసి జాన్వీ తన తొలి చిత్రం ధడక్ (2018)లోని జింగాత్ పాటకు నృత్యం చేశారు. ఇటీవల వారు కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన‌ జాన్వీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాశారు. రిహాన్న‌ను దేవ‌త అంటూ పొగిడేసింది. అనంత్- రాధిక హస్తక్షర్ వేడుకలో జాన్వీ ఇండియ‌న్ ట్రెడిష‌న్ శారీ లుక్ లో కనిపించింది. మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌తో పాటు భార్య ప్రిసిల్లా చాన్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, నందన్ నీలేకని, అదార్ పూనావల్ల, క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ కూడా ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. సినీప‌రిశ్ర‌మ నుంచి ఖాన్ ల త్ర‌యం స‌హా చాలా మంది ప్ర‌ముఖులు పాల్గొన‌గా, టాలీవుడ్ నుంచి రామ్ చ‌ర‌ణ్ - ఉపాస‌న దంప‌తులు ఎటెండ‌య్యారు.