ఓజీ ఓజీ అన్నారు.. ఇప్పుడు ఇదెలా ఉంది?: వీరమల్లు నిర్మాత
ఆ నేపథ్యంలో ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
By: Tupaki Desk | 3 July 2025 5:21 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న చిత్రాలు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. కొంతకాలంగా తాను ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలను శరవేగంగా పూర్తి చేస్తున్న విషయం తెలిసిందే. ముందుగా వీరమల్లు.. ఆ తర్వాత ఓజీని కంప్లీట్ చేసిన పవన్.. ఇప్పుడు ఉస్తాద్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
అయితే ఆ సినిమాలన్నింటిపై ఆడియన్స్ లో బజ్ ఇప్పటికే అలానే ఉంది. కొన్ని కారణాల సినిమాలు లేట్ అయినా.. సినీ ప్రియులు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు హరిహర వీరమల్లు మూవీ ముందుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 24న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
ఇప్పటికే అన్ని పనులు పూర్తిగా.. తాజాగా ఈవెంట్ ను ఏర్పాటు చేసి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదే సమయంలో ఈవెంట్ లో నిర్మాత ఏ ఎం రత్నం చేసిన వ్యాఖ్యలు కూడా తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట తెగ కనిపిస్తోంది.
ముఖ్యంగా ఆయన ఓజీ సినిమాను ఉద్దేశించి చేసిన కామెంట్ వైరలవుతోంది. "మీ అంతా ఇప్పటిదాకా ఓజీ ఓజీ ఓజీ ఓజీ అన్నారు. కానీ మీ ఎవరికీ హరిహర వీరమల్లు గురించి ఇంతవరకు తెలీదు. ఇప్పుడు చూశారు కదా.. ఎలా ఉంది?.. అదీ ఈ సినిమా అంటే" అంటూ వ్యాఖ్యానించారు ఏఎం రత్నం.
దీంతో ఇప్పుడు ఆ కామెంట్స్ కోసం అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. నిజానికి.. వీరమల్లు సినిమా స్టార్ట్ అయిన కొన్ని నెలల తర్వాత ఓజీ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. శరవేగంగా జరిగింది. అదే సమయంలో క్రేజీ అప్డేట్స్ మేకర్స్ ఇవ్వడంతో భారీ బజ్ ఆడియన్స్ లో క్రియేట్ అయింది.
అప్పుడు వీరమల్లు కన్నా ఓజీపైనే బజ్ ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో వీరమల్లు అప్డేట్స్ లేకపోవడం వల్ల మైనస్ అయినట్లు టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు ట్రైలర్ తో సూపర్ హైప్ క్రియేట్ చేశారు. అందుకే తమ మూవీ కూడా సూపర్ గా ఉంటుందనే చెప్పే ఉద్దేశంతో రత్నం అలా అన్నట్లు తెలుస్తోంది.
