Begin typing your search above and press return to search.

వీరమల్లు నిర్మాతకు ఏమైంది.. తప్పుడు వార్తలపై క్లారిటీ!

నిర్మాత ఏ ఎం రత్నం కళ్లు తిరిగిపడిపోయారని కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   30 May 2025 9:47 AM IST
వీరమల్లు నిర్మాతకు ఏమైంది.. తప్పుడు వార్తలపై క్లారిటీ!
X

నిర్మాత ఏ ఎం రత్నం కళ్లు తిరిగిపడిపోయారని కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆయన సమర్పణలో రూపొందుతున్న హరిహర వీరమల్లు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతుండగా, ఆయన తన ఆఫీస్ కు వచ్చిన కాసేపటికి స్పృహ కోల్పోయారని వార్తలు వినిపిస్తున్నాయి.

వెంటనే ఆస్పత్రిలో చేర్చారని, ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం డిశ్చార్జ్ కూడా అయ్యారని తెలిసింది. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెప్పారని టాక్ వినిపించింది. దీంతో సోషల్ మీడియాలో ఆ విషయం వైరల్ గా మారింది. ఏం జరిగిందోనని అంతా మాట్లాడుకుంటున్నారు.

ఇప్పుడు ఆ విషయంపై హరిహర వీరమల్లు నిర్మాత, ఏ ఎం రత్నం సోదరుడు, దయాకరరావు స్పందించారు. అన్నయ్య రత్నం స్పృహ కోల్పోయారని వస్తున్న వార్తలను ఎవరూ నమ్మవద్దని సోషల్ మీడియాలో శుక్రవారం పోస్ట్ పెట్టారు. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు బాగానే ఉన్నారని చెప్పారు.

ఎవరూ తప్పుడు సమాచారం వ్యాప్తి చేయవద్దని కోరారు. అలా రత్నం అస్వస్థతకు గురైన వార్తలను దయాకరరావు ఖండించారు. కాగా, ఏఎం రత్నం సమర్పణలో దయాకరరావు హరిహర వీరమల్లు మూవీని రూపొందిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ జోనర్ లో భారీ బడ్జెట్ తో సినిమాను గ్రాండ్ గా ఇద్దరూ కలిసి తెరకెక్కిస్తున్నారు.

కాగా, సినిమాలో మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో వీర యోధుడిగా పవన్ కల్యాణ్ కనిపించనున్నారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌ గా సందడి చేయనున్నారు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ రోల్‌ లో కనిపించనున్నారు. అనుపమ్ ఖేర్, నోరా ఫతేహి, విక్రమ్ జీత్, కబీర్ సింగ్ తదితరులు ఉన్నారు.

టాలీవుడ్ నటీనటులు సునీల్, పూజిత పొన్నాడ, అనసూయ కీలక పాత్రలు పోషించారు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జూన్ 12న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. అందుకు గాను అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరి కాస్త గ్యాప్ తర్వాత పవన్ థియేటర్స్ లోకి వస్తుండగా.. మూవీ ఎలాంటి విజయం అందుకుంటుందో వేచి చూడాలి.