స్టార్ బ్యూటీల సరసన ఆపరేషన్ బ్యూటీ!
వైఆర్ ఎఫ్ స్పై యూనివర్శ్ లో భాగంగా తొలి మహిళా గుఢాచర్య చిత్రం `ఆల్పా` ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 5 May 2025 5:00 PM ISTవైఆర్ ఎఫ్ స్పై యూనివర్శ్ లో భాగంగా తొలి మహిళా గుఢాచర్య చిత్రం `ఆల్పా` ఆన్ సెట్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అలియాభట్ , శర్వారీ వాఘ్ ప్రధాన పాత్రల్లో శివ్ రావెల్ ప్రతిష్టాత్మకంగా తెరకె క్కిస్తున్నారు. మునుపెన్నడు చూడని భారీ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. వైఎర్ ఎఫ్ బ్యానర్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. అలియా, శర్వారీ వాఘ్ సాహసోపేతమైన సన్నివేశాలతో అలరించడ ఖాయమంటూ ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
రియలిస్టిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం నటీమణులిద్దరు ఎక్కడా రాజీపడకుండా నటిస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ స్టంట్ మాస్టర్లు పనిచేస్తున్నారు. అయితే ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో తాజాగా మానుషీ చిల్లర్ కూడా భాగమైంది. అమ్మడు ఇందులో ఓకీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. దీంతో మానుషీ పాత్ర ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. అలియా, శార్వరీ పాత్రలపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.
ఇద్దరు పోటా పోటీగా నటిస్తున్నారు. మరి మానుషీ పాత్ర తెరపై కనిపించినంతసేపైనా విజిల్స్ వేయించాలా? ఉంటుందా? అన్నది చూడాలి. ఈ బ్యూటీ టాలీవుడ్ కి సుపరిచితమే. మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా నటించిన `ఆపరేషన్ వాలైంటైన్` లో హీరోయిన్ గా నటించింది. అదే అమ్మడికి తొలి తెలుగు సినిమా. కానీ ఆ సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఆ తర్వాత మళ్లీ తెలుగులో ఛాన్స్ రాలేదు.
ప్రస్తుతం బాలీవుడ్ లో మాత్రం రెండు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. `మాలిక్`, `టెహ్రాన్` చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. తాజాగా `ఆల్పా`లో ఛాన్స్ అందుకోవడంతో మానుషీ పేరు బాలీవుడ్ లో జోరుగా మారుమ్రోగుతుంది. బాలీవుడ్ లో మానుషీ కెరీర్ సామ్రాట్ పృధ్వీరాజ్ తో మొదలైన సంగతి తెలిసిందే.
