Begin typing your search above and press return to search.

అందంతో పాటు తెలివి కూడా ఎక్కువే..!

కన్నడ లో సినిమాలు చేసి ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న ఆషిక రంగనాథ్ తెలుగులో తొలి సినిమా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో చేసింది.

By:  Tupaki Desk   |   31 Jan 2024 3:30 PM GMT
అందంతో పాటు తెలివి కూడా ఎక్కువే..!
X

కన్నడ నుంచి ఎవరు వచ్చినా వారికి టాలీవుడ్ లో లక్ ఫేవర్ అవుతుంది. కొందరు మొదటి సినిమాతోనే సక్సెస్ అవ్వగా మరికొందరు ప్రయత్నాలు చేస్తుంటే ఫాం లోకి వస్తారు. రీసెంట్ టైం లో కన్నడ నుంచి వచ్చి తెలుగు సినిమాల్లో సందడి చేస్తున్న రష్మిక, కృతి శెట్టి తరహాలో ఇప్పుడు మరో అందాల భామ కూడా అదరగొట్టబోతుంది. కన్నడ లో సినిమాలు చేసి ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకున్న ఆషిక రంగనాథ్ తెలుగులో తొలి సినిమా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో చేసింది. అమిగోస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఆ సినిమాతో ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు.


అయితే నాగార్జున తో కలిసి నా సామిరంగ అంటూ సంక్రాంతికి వచ్చిన ఆషిక ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ సినిమా చూసిన వారంతా కూడా ఆషిక గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలా అమ్మడి అభినయం చూపించింది. తెలుగులో ఒక్క హిట్ పడితే ఆ హీరోయిన్ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. ప్రస్తుతం నా సామిరంగ తర్వాత ఆషిక వెంట దర్శక నిర్మాతలు క్యూ పడుతున్నారని తెలుస్తుంది.

తెలుగులో రాబోయే రోజుల్లో నెక్స్ట్ బిగ్ స్టార్ గా అవతరించే క్వాలిటీస్ అన్నీ ఆషికాలో ఉన్నాయని తెలుస్తుంది. అయితే ఆఫర్లు వస్తున్నాయి కదా అని కథను పట్టించుకోకుండా సినిమాలు చేసే ఆలోచనలో లేదు ఆషిక. ప్రేక్షకులు తన మీద చూపిస్తున్న ఈ అభిమానం కాపాడుకునే క్రమంలో అమ్మడు స్టోరీస్ సెలక్షన్స్ లో క్లవర్ నెస్ చూపిస్తుందట.

ఈమధ్య ఒకటి రెండు కథలు తన దగ్గరకు వచ్చినా సున్నితంగా తిరస్కరించిందట అమ్మడు. సో వాళ్లేమనుకుంటారు వీళ్లేమనుకుంటారు అనుకుని వచ్చిన ప్రతి ఆఫర్ ఓకే చేస్తే నీ గురించి అనుకునే వారు ఎవరు ఉండరనే విషయాన్ని ముందే కనిపెట్టింది ఆషిక. అందుకే అమ్మడి గురించి తెలిసిన ఎవరైనా అందంతో పాటు తెలివి కూడా ఎక్కువే అని అంటుంటారు.

నా సామిరంగ తర్వాత ఆషిక నెక్స్ట్ సినిమా ఏదన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. మరి ఈ అందాల భామని లక్కీ హీరోయిన్ ని ఏ హీరో.. ఏ డైరెక్టర్ ఎంపిక చేస్తారన్నది చూడాలి. ఆఫర్లు వరుసగా వస్తున్నా కథల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న ఆషిక మరో హిట్ పడింది అంటే మాత్రం కచ్చితంగా తెలుగులో ఆమెకు ఒక టాప్ చెయిర్ స్పేర్ చేయాల్సిందే అని చెప్పొచ్చు.