Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ - బన్నీ.. మళ్ళీ లోకల్ ఫ్లేవరే కానీ..

ఇక ఇలాంటి వార్తలు ఎన్ని వస్తున్నా కూడా అధికారికంగా ఇప్పటివరకు ఎవరు కూడా పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 9:56 AM GMT
త్రివిక్రమ్ - బన్నీ.. మళ్ళీ లోకల్ ఫ్లేవరే కానీ..
X

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇంతకుముందే వీరి కలయికలో వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల..వైకుంఠపురములో సినిమాలు ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు త్రివిక్రమ్ అన్ని కథలు లోకల్ తెలుగు ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యే విధంగానే ఉంటాయి. ఇక బన్నీ తో మరో సినిమాను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలి అని త్రివిక్రమ్ ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.

అయితే ఈసారి కేవలం తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా సినిమా హైలైట్ అయ్యే విధంగా ఉండాలి అని పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ప్రాజెక్టు ఉండబోతుంది అని ముందుగానే ఒక హింట్ అయితే ఇచ్చేశారు. అయితే ఈ ఇద్దరు ఎలాంటి సినిమా చేస్తారు అనే విషయంలో కూడా చాలా రకాల గాసిప్స్ పుట్టుకొచ్చాయి. పిరియాడికల్ మూవీ అని హిస్టారికల్ నేపథ్యం ఉన్న కథ అంటూ మరికొన్ని రూమర్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే.

ఇక ఇలాంటి వార్తలు ఎన్ని వస్తున్నా కూడా అధికారికంగా ఇప్పటివరకు ఎవరు కూడా పెద్దగా క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం ఈ సినిమాలో అల్లు అర్జున్ కంప్లీట్ గా తెలంగాణ మాండలికంలో డైలాగ్స్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పుష్పలో అతను చెప్పిన డైలాగ్స్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇక ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణ డైలాగ్స్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇదివరకే రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డి పాత్రలో తెలంగాణ భాషతో డైలాగ్ లు చెప్పి బాగా మెప్పించాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా కోసం కూడా తెలంగాణ లోకల్ ఫ్లేవర్ కు తగ్గట్టుగా డైలాగ్స్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి తీసుకువస్తూనే లోకల్ ఫ్లేవర్ ను త్రివిక్రమ్ హైలైట్ చేయబోతున్నట్లుగా టాక్.

తప్పకుండా కథ మాత్రం యూనివర్సల్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలానే ఉంటుందట. అందుకని ఈ ప్రాజెక్టుపై అల్లు అర్జున్ కూడా ఎక్కువగా ఆసక్తిని చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే పూర్తిస్థాయిలో స్క్రిప్టు సిద్ధమైన తర్వాతనే సినిమాపై అఫీషియల్ గా మరొక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా గ్రాడ్ గా తెరపైకి రాబోతోంది. తప్పకుండా ఈ సినిమాతో వెయ్యి కోట్ల బాక్సాఫీస్ మార్కెట్ ను అందుకోవాలని అనుకుంటున్నాడు. ఇక తర్వాత వచ్చే సినిమా కూడా అలానే ఉండాలి అని అతను ఆలోచిస్తున్నాడు. మరి త్రివిక్రమ్ అల్లు అర్జున్ ను మెప్పించే విధంగా ఎలాంటి కథను సిద్ధం చేస్తాడో చూడాలి.