Begin typing your search above and press return to search.

ఫొటో టాక్: బన్నీని ప్రేమతో నింపేసి ముద్దుల వర్షం

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ బెస్ట్ కపుల్స్ లిస్టు తీస్తే అందులో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి పేర్లు టాప్ లో ఉంటాయి అని చెప్పవచ్చు.

By:  Tupaki Desk   |   10 Nov 2023 9:48 AM GMT
ఫొటో టాక్: బన్నీని ప్రేమతో నింపేసి ముద్దుల వర్షం
X

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ బెస్ట్ కపుల్స్ లిస్టు తీస్తే అందులో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి పేర్లు టాప్ లో ఉంటాయి అని చెప్పవచ్చు. ఈ జంట ఎక్కడ కనిపించినా కూడా చాలా ఎట్రాక్టు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలొనే కాకుండా బాహ్య ప్రపంచంలో కూడా చాలా సింపుల్ గా కనిపించే ఈ అల్లు జోడి ఫోటోలు నిత్యం ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అవుతూనే ఉంటాయి.


బన్నీ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంటే ఆయన సతీమణి స్నేహ మాత్రం ఫ్యాన్స్ కు మరియు ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్గా ఆమె పోస్ట్ చేసిన మరొక ట్రెడిషనల్ ఫోటో కూడా ఎంతగానో ఆకట్టుకుంటాంది. అందులో అల్లు అర్జున్ తన వైపు తిరిగి ఉండగా ఆమె ప్రేమతో కౌగిలింతతో నింపేసింది.

అంతేకాకుండా బన్నీ బుగ్గపై ప్రేమగా ముందు కూడా పెట్టింది. ఈ లుక్ చూస్తూ ఉంటే ఈ జంట ఎంత అన్యోన్యంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అల్లు స్నేహారెడ్డి వారి పిల్లలకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇక బన్నీ కొడుకు కంటే కూడా అతని కూతురు అర్హ కు ఎక్కువ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది.

వారి ఫోటోలు కూడా నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతు ఉంటాయి. అర్హ ఇప్పటికే బాల నటిగా వెండితెరకు పరిచయం అయ్యింది. ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో పొందుతున్న ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆగస్టులో విడుదల కానుంది.

మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమా ఫస్ట్ పార్ట్ కంటే ఎక్కువగా వైబ్ క్రియేట్ చేసుకుంది. పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు సినిమా పై అమాంతం అంచనాలను పెరిగిపోయాయి. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఆ సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల కలెక్షన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.