Begin typing your search above and press return to search.

మంచు లక్ష్మికి అల్లు హీరో ముద్దు.. వైరల్ మూమెంట్!

మంచు లక్ష్మి సినిమా ఇండస్ట్రీలో ఒక నిర్మాతగానే కాకుండా నటిగా కూడా తనను తాను సరికొత్తగా నిరూపించుకున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 Nov 2023 11:20 AM GMT
మంచు లక్ష్మికి అల్లు హీరో ముద్దు.. వైరల్ మూమెంట్!
X

మంచు లక్ష్మి సినిమా ఇండస్ట్రీలో ఒక నిర్మాతగానే కాకుండా నటిగా కూడా తనను తాను సరికొత్తగా నిరూపించుకున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నటిగానే ఆమెకు మంచి ప్రశంసలు దక్కాయి. పాజిటివ్ రోల్స్ అని కాకుండా ఎక్కువగా ఆమె నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మొదటి సినిమా నుంచి కూడా ఎక్కువగా విభిన్నమైన క్యారెక్టర్స్ చేసే దిశగా అడుగులు వేస్తోంది.


అంతే కాకుండా పలు సినిమాలలో యాక్షన్ తరహా పాత్రలు కూడా చేసింది. అలాగే తమిళం మలయాళం ఇండస్ట్రీలలో కూడా మంచు లక్ష్మికి అవకాశాలు వచ్చాయి. ఇక ఆమె ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులతో కూడా చాలా స్నేహంగా ఉంటూ ఫోటోలకు స్టిల్స్ ఇస్తూ ఉంటారు. మంచు లక్ష్మి ఇండస్ట్రీలోని ఫ్యామిలీ ఈవెంట్స్ లో కూడా బాగానే పాల్గొంటూ ఉంటారు.

అలాగే తరచుగా ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పోటోలను షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలోని కొంతమందికి కూడా మంచు లక్ష్మితో చాలా స్నేహంగా ఉంటారు. రీసెంట్గా ఆమె పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అల్లు హీరో శిరీష్ ఆమె బుగ్గపై సరదాగా ముద్దు పెట్టుకున్నాడు. ఇంటర్నెట్ ప్రపంచంలో ఇప్పుడు అది వైరల్ అవుతోంది.

మెగా ఫ్యామిలీ అలాగే మంచి ఫ్యామిలీ ఎంతో కాలంగా స్నేహంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇక అల్లు ఫ్యామిలీతో కూడా మంచు మోహన్ బాబుకు మంచి స్నేహం ఉంది. వారి పిల్లలకు కూడా అవే స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి రీసెంట్గా దీపావళి పండుగ సందర్భంగా ఇచ్చిన పార్టీలో మంచు లక్ష్మి పాల్గొంది.

అందులో అక్కినేని హీరోలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు కూడా పాల్గొన్నారు. ఇక అందులో భాగంగానే సరదాగా అల్లు శిరీష్ తో కూడా ఆమె ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక ఎంతో స్నేహపూర్వకంగానే తుమ్ముడు లా ఉండే శిరీష్ మంచు లక్ష్మి అక్కని ముద్దు పెట్టుకుంటు ఫోటోకు స్టిల్ ఇచ్చారు. ఇక మంచు లక్ష్మి ప్రస్తుతం మంచి కంటెంట్ ఉన్న పాత్రలు వస్తే సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఎంటర్టైన్మెంట్ షోలకు హోస్ట్ గా ఉండేందుకు కూడా ఆసక్తిని చూపిస్తోంది.