Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : నందమూరి, అల్లు ఆత్మీయ ఆలింగనం

హీరోల అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వాదించుకుంటూ దెబ్బలాడుకునే వరకు వెళ్తూ ఉంటారు

By:  Tupaki Desk   |   17 Nov 2023 10:38 AM GMT
పిక్ టాక్ : నందమూరి, అల్లు ఆత్మీయ ఆలింగనం
X

హీరోల అభిమానులు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ వాదించుకుంటూ దెబ్బలాడుకునే వరకు వెళ్తూ ఉంటారు. అయితే హీరోలు మాత్రం చాలా స్నేహభావంతో మెలగడం సోషల్‌ మీడియాలో చూస్తూనే ఉంటాం. వారిని చూసి అయినా వారి వారి ఫ్యాన్స్ సోషల్‌ మీడియా వార్‌ తగ్గిస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుంది.


ఇక విషయానికి వస్తే ఇటీవల దీపావళి సందర్భంగా మెగాస్టార్‌ ఇంట పార్టీ ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ కి ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు చాలా మంది హాజరు అయ్యారు. వారికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్ మరియు అల్లు శిరీష్ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

అల్లు అర్జున్‌ సోదరుడు అయిన అల్లు శిరీష్ తన ఇన్‌ స్టా అకౌంట్‌ లో ఎన్టీఆర్‌ తో తీసుకున్న ఈ ఫోటోను షేర్‌ చేయడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్‌ ఇతరులు ఎవరు అడిగినా కూడా ఫోటోకు ఒకే విధంగా ఫోజ్ ఇస్తాడు అంటూ ఎన్టీఆర్‌ మంచి మనసు గురించి అల్లు శిరీష్ పేర్కొన్నాడు.

బ్లాక్‌ డ్రస్‌ లో ఎన్టీఆర్‌ మెరిసి పోయాడు అంటూ దీపావళి పండుగ రోజు నుంచి ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక అల్లు శిరీష్ కాస్త బరువు పెరిగినట్లుగా అనిపిస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ ఆత్మీయ ఆలింగనం కన్నుల విందుగా ఉంది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.