Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ సౌండ్ షురూ.. ఈ లుక్కు కేక సామీ

దర్శకుడు సుకుమార్ కూడా అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రను మరింత పవర్ఫుల్ గా చూపించేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   30 April 2024 4:38 PM GMT
పుష్ప రాజ్ సౌండ్ షురూ.. ఈ లుక్కు కేక సామీ
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫాన్స్ అయితే ఎంతో నమ్మకంతో ఉన్నారు. దర్శకుడు సుకుమార్ కూడా అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రను మరింత పవర్ఫుల్ గా చూపించేందుకు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇక నిర్మాణ సంస్థ కూడా సినిమా కోసం భారీగానే ఖర్చు చేస్తుంది.


దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న పుష్ప సీక్వెల్ మార్కెట్లో 1000 కోట్లు బిజినెస్ చేసే చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేయనున్నట్లు మేకర్స్ ఎంతో కాన్ఫిడెంట్ గా ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇంటర్నెట్ ప్రపంచంలో చాలా వైరల్ గా మారుతూ ఉన్నాయి. సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇదివరకే విడుదల చేశారు.

ఇక సినిమాలోని మొదటి లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక మొదటి పాట పుష్ప.. పుష్ప.. పుష్పరాజ్ అనే ఆ పాట బుధవారం రోజు 5 గంటలు 4 నిమిషాలకు విడుదల చేయబోతున్నారు. ఇక కొద్ది సేపటి క్రితమే ఒక స్పెషల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.

అందులో అల్లు అర్జున్ పూర్తిగా మాస్ గెటప్ లో కనిపిస్తూ ఉన్నాడు. ఈ పోస్టర్ తో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. తప్పకుండా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సినిమాలో మొత్తంగా ఐదు పాటలు ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందులో మొదటి పాట పుష్పా పుష్ప రాజ్ లిరికల్ వీడియోను విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ పాటలో పుష్పరాజ్ క్యారెక్టర్ ను మరింత ఎలివేట్ చేసే విధంగా లిరిక్స్ ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతే కాకుండా ఐకాన్ స్టార్ స్టైల్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే. కేవలం ఇండియాలోనే కాకుండా జపాన్ లో అలాగే మరిన్ని దేశ భాషల్లో సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.