Begin typing your search above and press return to search.

బన్నీ vs తారక్.. ఏంటి మ్యాటర్?

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలు కచ్చితంగా ఉంటాయి.

By:  Tupaki Desk   |   18 Feb 2024 5:52 AM GMT
బన్నీ vs తారక్.. ఏంటి మ్యాటర్?
X

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలు కచ్చితంగా ఉంటాయి. ఈ రెండు సినిమాల కోసం ఆయా హీరోల అభిమానులతోపాటు సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ ప్రాజెక్ట్ ల నుంచి చిన్న అప్డేట్ బయటకు వచ్చినా సందడి సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. అంతలా ఆ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ సినిమాలపై క్రేజ్ ఉంది మరి.

అయితే జూ.ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీలో విలన్ పాత్ర పోషిస్తున్న బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ గాయపడడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో షూటింగ్ పెండింగ్ ఉండిపోవడంతో ఇప్పటికే ప్రకటించిన రిలీజ్ డేట్ ను మార్చారు. ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన మూవీని అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ చేశారు.

ఇక పుష్ప-2పై పాన్ ఇండియా లెవెల్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. ఇటు సౌత్ తోపాటు నార్త్ లో ఓ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుంది. సుకుమార్ గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా.. ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మధ్య రెండు మూడు సార్లు రిలీజ్ డేట్ పై క్లారిటీ కూడా ఇచ్చారు. సుక్కూ మాస్టర్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.

అయితే పుష్ప-2 వాయిదా పడుతుందని ఆ డేట్ కు దేవర రిలీజ్ అవుతుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. వాటిపై సుక్కూ బృందం క్లారిటీ కూడా ఇచ్చింది. తాజాగా సినీ వర్గాల్లో దేవర మూవీ రిలీజ్.. పుష్ప సినిమాపైనే డిపెండ్ అయ్యి ఉందని టాక్ వినిపించింది. ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చారట పుష్ప మేకర్స్. రెండు సినిమాలు ఇప్పటికే ఫిక్స్ అయిన డేట్లకు విడుదల అవుతాయని చెప్పారట.

పుష్ప-2 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ స్పెషల్ సెట్ లో జరుగుతోంది. దీంతో ఎలా అయినా ఆ సినిమా టాకీ పార్ట్ జూన్ లాస్ట్ కల్లా కంప్లీట్ చెయ్యాలని మేకర్స్ డెడ్ లైన్ పెటుకున్నారట. ఆగస్టు 15న పుష్ప-2 పక్కాగా రిలీజ్ అవుతుందని చెప్పారట. ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. మొత్తానికి దేవర విడుదలకు పుష్ప సినిమాతో ఎలాంటి ప్రాబ్లమ్ లేనట్లే.