Begin typing your search above and press return to search.

బామ్మర్ది కోసం బన్నీ.. గట్టి సపోర్ట్ ఇస్తున్నారుగా!

ఇప్పుడు అల్లు అర్జున్ కజిన్, ఆయన మామయ్య కుమారుడు విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   27 Dec 2023 5:26 AM GMT
బామ్మర్ది కోసం బన్నీ.. గట్టి సపోర్ట్ ఇస్తున్నారుగా!
X

సినీఇండస్ట్రీలో వారసత్వం కొన్నేళ్లుగా కొనసాగుతోంది. ఇండస్ట్రీలోని నటీనటులతోపాటు ఇతర కేటగిరీలకు చెందిన ప్రముఖుల వారసులు హీరోహీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ఇలా ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు ఎంట్రీ ఇచ్చారు.

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్, నాగబాబు వారసులుగా వరుణ్ తేజ్, నిహారిక, నిర్మాత అల్లు అరవింద్ వారసులుగా అల్లు అర్జున్, శిరీష్ లతోపాటు మెగా మేనల్లుళ్లు సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తమదైన శైలిలో సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కజిన్, ఆయన మామయ్య కుమారుడు విరాన్ ముత్తంశెట్టి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు.

నిజానికి.. విరాన్ ముత్తంశెట్టి రెండేళ్ల క్రితమే హీరోగా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఆయన నటించిన తొలి చిత్రం బ్రతుకు బస్టాండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా అప్పుడు రిలీజ్ అయింది. కానీ ఆ చిత్రం కొన్ని కారణాల వల్ల విడుదల అవ్వలేదు. ఇప్పుడు ఆయన 'ముఖ్య గమనిక' సినిమాతో డెబ్యూ ఇస్తున్నారు. ఈ మువీ ట్రైలర్ వచ్చే వారం విడుదల కానుంది.

అయితే మెగా హీరోలకు విరాన్ కు ఒక కామన్ పాయింట్ ఉంది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మెగా హీరోల్లో చాలా మంది డెబ్యూ మూవీలు కొన్ని కారణాల వల్ల విడుదల అవ్వలేదు. ఇప్పుడు విరాన్ విషయంలో అదే జరిగింది. ముఖ్య గమనిక మూవీ విషయంలో విరాన్ కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తోపాటు ఆయన సోదరుడు వెంకటేశ్ సపోర్ట్ చేస్తున్నారు.

ముఖ్య గమనిక మూవీలో విరాన్ ముత్తంశెట్టికి జోడీగా కొత్త హీరోయిన్ లావణ్య నటిస్తున్నారు. ప‌లు విజ‌య‌వంతమైన చిత్రాల‌కు సినిమాటోగ్రాఫ‌ర్ గా ప‌నిచేసిన వేణు ముర‌ళీధ‌ర్.వి ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. శివిన్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా రాజ‌శేఖ‌ర్‌, సాయి కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కిరణ్ వెన్న సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. మరి తొలి సినిమాతో ఈ మెగా కజిన్ ఎలా మెప్పిస్తారో చూడాలి.