Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్ త్రివిక్రం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!

అల వైకుంఠపురములో లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసి చేసే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   29 Aug 2023 7:51 AM GMT
అల్లు అర్జున్ త్రివిక్రం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్..!
X

పుష్ప 1 సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డ్ రావడంతో ఫుల్ జోష్ లో ఉన్నాడు అల్లు అర్జున్. పుష్ప రాజ్ అభినయానికి ఉత్తమ నటుడి అవార్డు అందుకోగా పుష్ప 2 లో అంతకుమించి అదరగొట్టేలా తన పాత్రని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. పుష్ప 2 ఆల్రెడీ సగానికి పైగా పూర్తి కాగా సినిమాపై ఇంకాస్త ఫోకస్ ఎక్కువ పెట్టి ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకూడదని ప్లాన్ చేస్తున్నారట. పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్ భారీ ప్లానింగ్ తో ఉన్నాడని తెలుస్తుంది.

పుష్ప తర్వాత ఆల్రెడీ సందీప్ వంగాతో సినిమా అనౌన్స్ చేశాడు. కానీ దాని కన్నా ముందు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే. జులాయితో మొదలైన వీరి కాంబో చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ అయ్యాయి. అల వైకుంఠపురములో అయితే నాన్ బాహుబలి రికార్డులను తిరగ రాసి అదరగొట్టేసింది.

అల వైకుంఠపురములో లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ కలిసి చేసే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను అందుకునేలా త్రివిక్రమ్ కథ రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.

ఈ సినిమా త్రివిక్రం కెరీర్ లో ఎప్పుడూ చేయని ఒక ప్రయోగాత్మక సినిమాగా ఉంటుందట. సినిమా ఒక పీరియాడికల్ డ్రామాగా ఫాంటసీ మూవీగా ప్లాన్ చేస్తున్నారట. ఎప్పుడు తన సినిమాల్లో కథ గురించి పెద్దగా ఆలోచించని త్రివిక్రమ్ తన డైలాగ్స్ తోనే హిట్ కొట్టేస్తాడు.

అల్లు అర్జున్ తో చేసే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉంటుందని తెలుస్తుంది. త్రివిక్రమ్ కూడా భారీ స్కేల్ సినిమాలు చేయడం మొదలు పెడితే తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి తన స్టామినా చూపించడం పక్కా అని చెప్పొచ్చు.

ప్రస్తుతం మహేష్ తో గుంటూరు కారం సినిమా చేస్తున్న త్రివిక్రమ్ అల్లు అర్జున్ సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా కూడా హారిక హాసిని బ్యానర్ లోనే ఉంటుందని తెలుస్తుంది. రాజమౌళి, సుకుమార్ తర్వాత త్రివిక్రమ్ కూడా ఈసారి పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెట్టాడు. త్రివిక్రమ్ పెన్ పవర్ రుచి ఏంటో నేషనల్ లెవెల్ ఆడియన్స్ కి చూపిస్తే మాత్రం ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టేయడం పక్కా అని చెప్పొచ్చు.