Begin typing your search above and press return to search.

జీనియస్ సుక్కుతో ఐకాన్.. వెయ్యి కోట్లు కనిపిస్తున్నాయి

హ్యాపీ బర్త్ డే మై జీనియస్ సుక్కు డార్లింగ్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   11 Jan 2024 11:19 AM GMT
జీనియస్ సుక్కుతో ఐకాన్.. వెయ్యి కోట్లు కనిపిస్తున్నాయి
X

క్రియేటివ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి సుకుమార్. రెగ్యులర్ కి భిన్నమైన హీరోయిజంలో కూడా కొత్త కోణాన్ని ఆవిష్కరించడంలో సుకుమార్ స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. అయితే రంగస్థలం, పుష్ప సినిమాలని కంప్లీట్ మాస్ టచ్ తో సుకుమార్ చేసి అందరికి షాక్ ఇచ్చారు.

ఎప్పుడు జీనియస్ హై ఇంటలిజెన్స్ మూవీస్ మాత్రమే సుకుమార్ చేస్తాడనే వారికి ఈ రెండు సినిమాలతో సుకుమార్ సమాధానం చెప్పాడు. పుష్ప మూవీ పాన్ ఇండియా లెవల్ లో సూపర్ హిట్ అయ్యింది. హిందీలో అయితే ఏకంగా వంద కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో పాటలు కూడా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

ఇప్పుడు పుష్ప 2 షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ చిత్రీకరించే పనిలో సుకుమార్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఈ ఐటెం సాంగ్ లో కనిపించబోతున్నారంట. ఇదిలా ఉంటే సుకుమార్ కి అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సుకుమార్ బర్త్ డే కావడంతో పుష్ప 2 షూటింగ్ సెట్ లో దిగిన ఫోటోని షేర్ చేసి బన్నీ విషెస్ తెలియజేశారు. దీంతో నెటిజన్లు నెక్స్ట్ వెయ్యి కోట్ల బాక్సాఫీస్ కనిపిస్తోంది అని పాజిటీవ్ గా రియాక్ట్ అవుతున్నారు.

హ్యాపీ బర్త్ డే మై జీనియస్ సుక్కు డార్లింగ్ అంటూ బన్నీ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవుతోంది. దీంతో పాటు సుకుమార్ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ కూడా అతనికి విషెస్ చేయడంతో సినిమా ఆగష్టు 15న రిలీజ్ అని మరోసారి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోన్న కేశవ అరెస్ట్ కావడంతో షూటింగ్ ఆలస్యం అవ్వొచ్చని అందరూ భావించారు.

డైరెక్టర్ తలచుకుంటే, అది కూడా సుకుమార్ లాంటి డైరెక్టర్ మనసు పెడితే చాలా మార్గాలు దొరుకుతాయి. అందుకే షూటింగ్ ఎలాంటి టెన్షన్ లేకుండానే సుకుమార్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. బర్త్ డే సందర్భంగా ఇండస్ట్రీ ప్రముఖులు చాలా మంది సుకుమార్ కి ప్రత్యేకంగా విషెస్ చేస్తూ ఉండటం విశేషం. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కచ్చితంగా వెయ్యి కోట్ల మార్క్ ను అందుకుంటుంది అనేలా అంచనాలు ఏర్పడుతున్నాయి. మరి బన్నీ కెరీర్ లో పుష్ప 2 ఏ రేంజ్ లో క్లిక్ ఆవుతుందో చూడాలి.