Begin typing your search above and press return to search.

పుష్ప 2 టీజర్.. జాతరలో బన్నీ బీభత్సం!

రోజుకో పోస్టర్ విడుదల చేస్తూ టీజర్ పై మరింత అంచనాలను తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి

By:  Tupaki Desk   |   8 April 2024 6:15 AM GMT
పుష్ప 2 టీజర్.. జాతరలో బన్నీ బీభత్సం!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న పుష్ప సెకండ్ పార్ట్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫస్ట్ పార్ట్ కంటే ఇప్పుడు రెండో భాగం అంతకుమించి అనేలా ఉండాలి అని మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఇప్పటికే సినిమాకు సంబంధించిన టీజర్ హడావిడితో కావలసినంత హైప్ క్రియేట్ చేశారు.

రోజుకో పోస్టర్ విడుదల చేస్తూ టీజర్ పై మరింత అంచనాలను తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు అనే చెప్పాలి. ఇక సినిమాలో జాతర ఎపిసోడ్ కు సంబంధించిన యాక్షన్ సీన్ కూడా గట్టిగా ఉండబోతున్నట్లు చాలా రకాల లీకులు వచ్చాయి. ఇక ఇప్పుడు మొత్తానికి టీజర్ లో అదే సన్నివేశాన్ని హైలెట్ చేయడం ఫ్యాన్స్ కు మంచి కిక్ అయితే ఇస్తుంది. నేడు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా టీజర్ రిలీజ్ చేశారు.

జాతర హడావిడితోపాటు అల్లు అర్జున్ ఊర మాస్ లో భీకరమైన అమ్మవారి లుక్కులో చాలా ఉగ్రరూపంతో కనిపిస్తూ ఉండడం టీజర్ కు మరింత బూస్ట్ ఇచ్చింది. ఇక ఇందులో విలన్స్ ను ఊచకోత కోసే యాక్షన్ ఎపిసోడ్ కూడా బలంగా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది. అల్లు అర్జున్ కత్తితో బొట్టు పెట్టుకోవడం అలాగే ఉగ్రరూపంతో స్టెప్పులు వేయడం వంటి అంశాలు కూడా మరింత హైలెట్ అవుతున్నాయి.

ఇక లుక్ విషయంలో అల్లు అర్జున్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో మరోసారి ఈ ఒక్క టీజర్ తో అర్థం అయిపోయింది. అతని అరికాలు నుంచి నుదుట బొట్టు వరకు అన్ని విషయాల్లో కూడా పక్కా లెక్కలతో సుకుమార్ అల్లు అర్జున్ ను ప్రజెంట్ చేసినట్లుగా అర్థమవుతుంది. చూస్తుంటే ఈ యొక్క సన్నివేశం తోనే థియేటర్లో పూనకాలు తెప్పించేలా ఉన్నారు అనే కామెంట్స్ వస్తూ ఉన్నాయి.

మొత్తానికి లాస్ట్ షాట్ కూడా గూస్ బంప్స్ తెప్పించే లాగా కనిపిస్తోంది. ఇక పుష్ప సెకండ్ పార్ట్ లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే అని కూడా మేకర్స్ చెబుతున్నారు. ఇలాంటి హై వోల్టేజ్ సన్నివేశాలు సినిమాలో ఇంకా చాలా ఉన్నాయని కూడా తెలుస్తోంది. సినిమాను ఈ ఎడాది ఆగస్టు 15వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయాలని అనుకుంటున్న విషయం తెలిసిందే. విడుదల డేట్ విషయంలో అప్పుడప్పుడు కొన్ని రకాల రూమర్స్ వస్తున్నప్పుటికీ మేకర్స్ మాత్రం ఆ విషయంలో డౌట్ అక్కర్లేదు అన్నట్లుగానే అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 1000 కోట్ల మార్క్ ను అందుకుంటుందో లేదో చూడాలి.