Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. బ్రాండ్ కా బాప్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సినిమాకి తన ఇమేజ్, బ్రాండ్ వేల్యూ పెంచుకుంటూ ఐకాన్ హీరోగా దూసుకుపోతున్నాడు

By:  Tupaki Desk   |   19 April 2024 4:37 AM GMT
అల్లు అర్జున్.. బ్రాండ్ కా బాప్!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా సినిమాకి తన ఇమేజ్, బ్రాండ్ వేల్యూ పెంచుకుంటూ ఐకాన్ హీరోగా దూసుకుపోతున్నాడు. గంగోత్రితో మొదలైన అల్లు అర్జున్ ప్రయాణం పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయికి చేరింది. టాలీవుడ్ ఫస్ట్ నేషనల్ అవార్డు విన్నింగ్ హీరోగా అల్లు అర్జున్ ఈ రోజు నిలబడ్డాడు అంటే అందులో అతని కృషి ఎంతో ఉందని చెప్పాలి. సినిమా సినిమాకి అల్లు అర్జున్ యాక్టర్ గా వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా అందరికంటే బెస్ట్ అనిపించుకున్నాడు.

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ పుష్ప ది రూల్ మూవీతో బాలీవుడ్ స్టార్స్ అయిన ఖాన్ త్రయాన్ని కూడా బీట్ చేస్తున్నాడు. నార్త్ లో తన మార్కెట్ ని టాప్ లో నిలుపుకున్నాడు అంటే టాలీవుడ్ కి కూడా ఇది గర్వించదగ్గ విషయం. పుష్ప మూవీ హిందీ రిలీజ్ రైట్స్ ఏకంగా 200 కోట్లకి బాలీవుడ్ బడా డిస్టిబ్యూటర్ అనిల్ తడాని కొనుగోలు చేశారు.

పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ప్రభాస్ సినిమాల బిజినెస్ కూడా ఇప్పటి వరకు ఈ స్థాయిలో జరగలేదని చెప్పాలి. హిందీ థీయాట్రికల్ రైట్స్ పరంగా బాలీవుడ్ ఖాన్స్ ని కూడా అల్లు అర్జున్ డామినేషన్ చేసి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశాడు. అలాగే పుష్ప ది రూల్ మూవీ డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 250 కోట్లకి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇదే బిగ్గెస్ట్ డీల్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ ఒక్క ఇండియన్ స్టార్ హీరో సినిమాకి కూడా ఈ స్థాయిలో రైట్స్ రాలేదు. ఇది కూడా అల్ టైం రికార్డ్ గా నిలిచింది. ఇండియాలో డిజిటల్ రైట్స్ పరంగా హైయెస్ట్ డీల్ రికార్డ్ గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఉంది. ఆ చిత్రాన్ని సైతం పుష్ప ది రూల్ తో అల్లు అర్జున్ బీట్ చేశాడు. బన్నీ బ్రాండ్ ఇమేజ్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని రూల్ చేస్తున్న స్టార్స్ అందరికంటే ఎక్కువగా ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.

ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సౌత్ నుంచి రాజమౌళి బ్రాండ్ మాత్రమే వినిపించేది. అయితే రాజమౌళితో మూవీ చేయకుండానే అల్లు అర్జున్ సోలోగా బాక్సాఫీస్ ధీరుడిగా అవతరించాడు. అత్యధిక బ్రాండ్ ఇమేజ్ ఉన్న హీరోగా మారాడు. పుష్ప ది రూల్ మూవీకి కేవలం డిజిటల్, హిందీ రైట్స్ ద్వారానే 450 కోట్ల వ్యాపారం జరిగిందని అర్ధమవుతోంది.

ఇక తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్ తో పాటు మిగిలిన సౌత్ స్టేట్స్ కలుపుకొంటే మరో 200 నుంచి 250 కోట్ల వరకు డీల్స్ జరిగే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే పుష్ప ది రూల్ మూవీ పై ప్రపంచవ్యాప్తంగా 650 నుంచి 700 కోట్ల బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం క్లిక్కయినా పుష్పతో బన్నీ 1000 కోట్ల క్లబ్ లో చేరడం పక్కా.