Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : జాతీయ అవార్డ్‌ - 2 రెడీ అయిన పుష్ప

అందరి దృష్టిని ఆకర్షిస్తూ అల్లు అర్జున్‌ పుష్ప గా సూపర్‌ గా ఉన్నాడు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Aug 2023 5:18 AM GMT
పిక్ టాక్ : జాతీయ అవార్డ్‌ - 2 రెడీ అయిన పుష్ప
X

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా సెన్షేషనల్‌ సక్సెస్ ను దక్కించుకుంది. రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేసింది. అవన్నీ ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్‌ కు ఉత్తమ నటుడుగా జాతీయ అవార్డు రావడంతో పాటు పలు విభాగాల్లో పుష్ప జాతీయ అవార్డును సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.


ఇప్పుడు పుష్ప సినిమా సీక్వెల్‌ షూటింగ్‌ జరుగుతోంది. పుష్ప 2 సినిమా షూటింగ్‌ ఎలా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అంటూ ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. పుష్ప 2 సినిమా ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌ సిటీ లో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇన్‌ స్టా గ్రామ్‌ అఫిషియల్‌ అకౌంట్‌ లో ఆ వీడియో షేర్‌ అయింది.

అదే సమయంలో ఈ పిక్ ను కూడా బన్నీ ఫ్యాన్స్ కోసం పుష్ప 2 మేకర్స్ షేర్‌ చేయడం జరిగింది. అందరి దృష్టిని ఆకర్షిస్తూ అల్లు అర్జున్‌ పుష్ప గా సూపర్‌ గా ఉన్నాడు అంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. పుష్ప సినిమాకు జాతీయ అవార్డును దక్కించుకున్న బన్నీ పుష్ప 2 తో కూడా జాతీయ అవార్డును దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా ఈ ఫోటో ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది.

పుష్ప 2 సినిమా లో కూడా బన్నీ నటన పీక్స్‌ లో ఉంటుందని ముందు నుండే సుకుమార్‌ తో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఆకట్టుకునే కంటెంట్‌ కు తోడు బన్నీ నటన అద్భుతంగా ఉంటే ఇక ఫ్యాన్స్ కి పండగే కదా... అంతే కాకుండా మరో జాతీయ అవార్డు కూడా రావడం పక్కా కదా అంటూ సోషల్‌ మీడియాలో జనాలు మాట్లాడుకుంటున్నారు.