Begin typing your search above and press return to search.

పుష్ప-2.. ఇక ప్రతి నిమిషం ముఖ్యమే!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్‌'

By:  Tupaki Desk   |   15 May 2024 2:32 PM GMT
పుష్ప-2.. ఇక ప్రతి నిమిషం ముఖ్యమే!
X

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్‌ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా 'పుష్ప: ది రూల్‌'. క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబోలో రానున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన 'పుష్ప పార్ట్‌- 1' ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా వరల్డ్‌ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.

అయితే అప్పటి నుంచే ఈ మూవీ సీక్వెల్ పై చాలా ఆసక్తి నెలకొంది. పుష్ప సీక్వెల్ విషయంలో దర్శకుడు సుకుమార్ మరింత జాగ్రత్త పడుతున్నారు. ఏ విషయంలో కూడా రాజీ పడకుండా తెరకెక్కిస్తుండడం వల్ల విడుదల కాస్త ఆలస్యమైంది. మొత్తానికి ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్.. క్రేజీ అప్డేట్స్ ఇస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ లో బన్నీ లుక్ అదిరిపోయింది.

చీర కట్టుకొని అల్లు అర్జున్ చూపించిన విశ్వరూపం అభిమానులను తెగ ఆకట్టుకుంది. ఇదొక్క సీన్తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ సాంగ్ అనేక రికార్డులు సృష్టిస్తోంది. త్వరలోనే సెకండ్ సాంగ్ కూడా విడుదల అవ్వనుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే రిలీజ్ డేట్ పై అనేక సార్లు క్లారిటీ ఇచ్చారు మేకర్స్.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఐటెం సాంగ్ తో పాటు ఫహాద్‌ ఫాజిల్ షూటింగ్ పార్ట్ పెండింగ్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫహాద్‌ ఫాజిల్‌ చిత్రీకరణతో షూటింగ్ పూర్తి కానుందని టాక్‌. ఇందుకు ఆయన రెండు వారాల షెడ్యూల్‌ కేటాయించినట్టు సమాచారం. దీంతో సుకుమార్ యమా స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 90 రోజుల్లో ప్రతి నిమిషం కూడా ముఖ్యమే అన్నట్లు పరిగెడుతున్నారట.

అయితే పుష్ప-1 సమయంలో చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారు సుక్కు మాస్టర్. విడుదల ముందు వరకు ఏదో పని పూర్తి చేస్తూనే ఉన్నారు. అందుకే దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లో ఆయన మార్క్ కాస్త మిస్ అయిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ సారి మాత్రం జులై కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. అందుకు బన్నీ కూడా పూర్తిగా సహకరిస్తున్నారు. కచ్చితంగా అనుకున్న తేదీకి రిలీజ్ చేయాలనే టార్గెట్ తో అంతా వర్క్ చేస్తున్నారట.

ఇక పుష్ప-2 సినిమా ట్రైలర్ ను జూన్ లాస్ట్ లో విడుదల చేయాలని సుకుమార్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల్లో ఈ మూవీ డిజిటల్, థియేట్రికల్, శాటిలైట్ రైట్స్ సహా అన్ని అగ్రిమెంట్లను కంప్లీట్ చేయనున్నారట మైత్రీ అధినేతలు. అయితే ఏ సినిమాకు కూడా సాధ్యం కాని రీతిలో పుష్ప-2 రూ.1000 కోట్ల బిజినెస్ చేస్తుందని అంతా అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.