Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!

పుష్ప కి దక్కిన విజయం నేపథ్యంలో పుష్ప 2 ను అంతకు మించి అన్నట్లుగా రూపొందించే పనిలో దర్శకుడు సుకుమార్‌ ఉన్నాడు

By:  Tupaki Desk   |   5 March 2024 7:06 AM GMT
పుష్ప రాజ్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..!
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌ లో రూపొందుతున్న పుష్ప 2 కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప కి దక్కిన విజయం నేపథ్యంలో పుష్ప 2 ను అంతకు మించి అన్నట్లుగా రూపొందించే పనిలో దర్శకుడు సుకుమార్‌ ఉన్నాడు.

ఏడాది పాటు వర్క్ చేసి అద్భుతమైన స్క్రిప్ట్‌ ను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది. పుష్ప 1 తో జాతీయ అవార్డు దక్కించుకున్న బన్నీ పుష్ప 2 కోసం అంతకు మించి అన్నట్లుగా కష్టపడుతున్నాడు. గత ఏడాది కాలంగా చిత్రీకరణ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం సినిమా యొక్క చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో అల్లు అర్జున్ తో పాటు కొంత మంది డాన్సర్స్ పై పాట చిత్రీకరణ జరుగుతోందట. ఒకటి రెండు రోజుల్లో పాట చిత్రీకరణ పూర్తి అవ్వబోతుంది. వెంటనే అంటే ఈనెల 7వ తారీకున పుష్ప 2 యూనిట్‌ మొత్తం కూడా కొత్త షెడ్యూల్‌ కోసం వైజాగ్‌ వెళ్లబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

వైజాగ్‌ షెడ్యూల్‌ లో కొన్ని రోజుల తర్వాత రష్మిక మందన్న జాయిన్‌ అవ్వబోతుంది. ఆమె పై కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేస్తారు. ఆ తర్వాత బన్నీ, రష్మిక లపై కూడా కొన్ని సన్నివేశాల చిత్రీకరణ చేయనున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

ఇక పుష్ప సినిమాకు పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కనుక పుష్ప 2 లో కూడా అద్భుతమైన పాటలు ఉండే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ గత కొన్ని నెలలుగా ఆ పని మీదే ఉన్నాడు. కచ్చితంగా పుష్ప 2 ను కూడా మ్యూజికల్‌ హిట్‌ గా నిలపడం ఖాయం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఇదే ఏడాది ఆగస్టు 15న విడుదల అవ్వబోతుంది.