Begin typing your search above and press return to search.

పుష్ప2.. మళ్ళీ మార్పులా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2

By:  Tupaki Desk   |   11 Jun 2024 11:12 AM GMT
పుష్ప2.. మళ్ళీ మార్పులా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఆగష్టు 15న ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన రెండు సాంగ్స్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వాటికి పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఓ వైపు పూర్తి చేసే ప్రయత్నం చేస్తూనే మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ చేస్తున్నారు. ఆగష్టు మొదటి వారం వరకు సుకుమార్ పుష్ప 2 షూటింగ్ చేయనున్నాడంట. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతోన్న మూవీ కావడంతో సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ చిత్రాన్ని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. ఈ సినిమాలో మొదటి పార్ట్ లో ఉన్న నటీనటులతో పాటుగా మరికొంత మంది కొత్తగా యాడ్ అయ్యారు. ఫాహద్ ఫాజిల్ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి సంబందించిన కీలక అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. మూవీకి ఎడిటర్ గా వర్క్ చేస్తోన్న కార్తీక్ శ్రీనివాస్ తప్పుకున్నారంట.

సుకుమార్ తో క్రియేటివ్ డిఫరెన్స్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. కార్తీక్ శ్రీనివాస్ స్థానంలో ఎడిటర్ గా నవీన్ నూలి కన్ఫర్మ్ అయ్యారు. ఇప్పటికే నవీన్ నూలి టీం మూవీ ఎడిటింగ్ పై వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ ఈ సినిమాకి సంబందించిన ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవుట్ ఫుట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు. నవీన్ కు ఇదివరకే టాప్ సినిమాలకు వర్క్ చేసిన ఉంది. ఇక ఇప్పుడు అతను పుష్ప 2 టీమ్ లో కలవడం హాట్ టాపిక్ గా మారింది.

కచ్చితంగా పుష్ప2 తో 1000 కోట్ల కలెక్షన్స్ అందుకోవాలనే టార్గెట్ ను చిత్ర యూనిట్ పెట్టుకుంది. ఈ సినిమా బిజినెస్ డీల్స్ కి సంబందించిన చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయంట. డిజిటల్ రైట్స్ ఇప్పటికే అమ్ముడైపోయాయి. గత కొన్ని రోజులుగా థీయాట్రికల్ బిజినెస్ పై కూడా డిస్కషన్స్ సాగుతున్నాయి. ఈ చిత్రంలో రష్మిక మందన అల్లు అర్జున్ కి జోడీగా నటిస్తోంది. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.