Begin typing your search above and press return to search.

పుష్ప 2 కౌంట్ డౌన్ స్టార్ట్.. రికార్డులకు రెడ్ అలర్ట్..!

ఒక నిర్మాత కొడుకుగా ఏదో సినిమాలు చేసుకుంటూ పోదాం అనుకుంటే అల్లు అర్జున్ ఇలా నేషనల్ స్థాయిలో ఉండే వాడు కాదు

By:  Tupaki Desk   |   8 April 2024 1:30 PM GMT
పుష్ప 2 కౌంట్ డౌన్ స్టార్ట్.. రికార్డులకు రెడ్ అలర్ట్..!
X

20 ఏళ్ల క్రితం కొత్త దర్శకుడు ఆర్య అనే సినిమాతో ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు. అంతకుముందు గంగోత్రి అనే సినిమా తీసిన హీరో ఆర్యతో యూత్ ఆడియన్స్ ను అకట్టుకున్నాడు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడిగా అల్లు అర్జున్, ఆర్య సినిమా దర్శకుడిగా సుకుమార్ ఈ ఇద్దరి ఫ్రెండ్ షిప్ కి కారణమైంది. ఆర్య సినిమా అప్పటివరకు వచ్చిన తెలుగు లవ్ స్టోరీస్ కు డిఫరెంట్ గా ఫీల్ మై లవ్ అంటూ కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇక అప్పటి నుంచి సుకుమార్ తన ప్రతి సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండేలా జాగ్రత్త పడుతూ స్టార్ క్రేజ్ తెచ్చుకోగా ఆర్య నుంచి పుష్ప 1 వరకు అల్లు అర్జున్ సెల్ఫ్ మేడ్ స్టార్ గా ఎదిగాడు.

ఒక నిర్మాత కొడుకుగా ఏదో సినిమాలు చేసుకుంటూ పోదాం అనుకుంటే అల్లు అర్జున్ ఇలా నేషనల్ స్థాయిలో ఉండే వాడు కాదు. నిర్మాత కొడుకుగా కాదు సినీ పరిశ్రమకు ఏమాత్రం సంబంధం లేని హీరోగా తను వెళ్లే దారిని తానే సరిచేసుకుంటూ వచ్చాడు. సినిమాకు పెట్టాల్సిన ఎఫర్ట్ కన్నా ఎక్కువ పెడుతూ స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. ఆర్య తర్వాత ఆర్య 2 సినిమా చేసిన సుకుమార్ అల్లు అర్జున్ హ్యాట్రిక్ సినిమా చేస్తే నెవర్ బిఫోర్ అనిపించేలా చేయాలని అనుకున్నారు ఆ ఆలోచనతోనే మొదలైంది పుష్ప మూవీ.

పుష్ప 1 ది రైజ్ సంచలనం ఎలాంటిదో తెలిసిందే. సౌత్ ఆడియన్స్ ను కాదు బీ టౌన్ ఆడియన్స్ ను కూడా పుష్ప రాజ్ పాత్రతో పూనకాలు వచ్చేలా చేశాడు అల్లు అర్జున్. పుష్ప 1 సెన్సేషనల్ హిట్ కాగా పుష్ప 2 అంతకుమించి అనిపించేందుకు రాబోతుంది. ఆగష్టు 15న రిలీజ్ కాబోతున్న పుష్ప 2 పై ఎన్ని అంచనాలు ఉన్నా వాటికి ఒకదానికి రెట్టింపు లెక్క చెప్పేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు.

పుష్ప 2 రిలీజ్ దగ్గర పడుతుంది. బన్నీ బర్త్ డే తో కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అందుకే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప రాజ్ గంగమ్మ అవతారంలో దర్శనమిచ్చాడు. ఈ టీజర్ తో రికార్డులకు రెడ్ అలర్ట్ ఇస్తూ.. సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని హింట్ ఇస్తున్నాడు సుకుమార్. పుష్ప 1 తో నేషనల్ అవార్డు అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 తో మరోసారి అది అందుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనిపిస్తుంది. ప్రచార చిత్రాలతోనే గూస్ బంప్స్ తెప్పిస్తున్న సుకుమార్ పుష్ప 2 తో పాన్ ఇండియా లెవెల్ లో బాక్సాఫీస్ ని షేక్ చేయడం పక్కా అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.