Begin typing your search above and press return to search.

పుష్ప 2 : వెయిట్‌ చేయిస్తూ వెయిట్ పెంచే ప్లాన్‌

అల్లు అర్జున్‌ సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాకు అభిమానులు సుదీర్ఘ కాలం వెయిట్‌ చేయక తప్పేలా లేదు

By:  Tupaki Desk   |   2 Aug 2023 8:08 AM GMT
పుష్ప 2 : వెయిట్‌ చేయిస్తూ వెయిట్ పెంచే ప్లాన్‌
X

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాకు అభిమానులు సుదీర్ఘ కాలం వెయిట్‌ చేయక తప్పేలా లేదు. మొన్నటి వరకు 2023 లోనే సినిమా ఉంటుందని అంతా భావించారు. అదే విధంగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తూ ఉంటే 2024 వరకు వెయిట్‌ చేయాల్సి రావచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

పుష్ప 2 సినిమా షూటింగ్‌ ఇప్పటి వరకు కాస్త అటు ఇటుగా సగం వరకు పూర్తి అయ్యి ఉంటుందట. మిగిలిన సగం షూటింగ్‌ హడావుడిగా పూర్తి చేయాలని సుకుమార్‌ భావించడం లేదు. స్క్రిప్ట్‌ కోసం ఏడాది సమయం ఎలా అయితే తీసుకున్నాడో షూటింగ్‌ కోసం కూడా అలాగే సమయం ఎక్కువ తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

సుకుమార్‌ తన గత చిత్రాల మాదిరిగా స్పీడ్ గా షూటింగ్ చేయడం లేదు. మెల్లగా ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్‌ గా అయ్యే వరకు వెయిట్‌ చేసి మరీ కంప్లీట్‌ చేసుకుంటున్నాడట. అందుకే పుష్ప 2 సినిమా షూటింగ్ 2023 డిసెంబర్ వరకు పూర్తి అయ్యే అవకాశాలు లేవని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులను ఫ్యాన్స్‌ ను వెయిట్‌ చేయించడం ద్వారా వెయిట్‌ పెంచాలని భావిస్తున్నారు. అందుకే షూటింగ్ ను మెల్లగా చేస్తూ సినిమా కోసం ఎక్కువ కాలం వెయిట్‌ చేసేలా చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో ఎంత ఎక్కువ వెయిట్ చేయిస్తే ఆ ప్రాజెక్ట్‌ యొక్క వెయిట్‌ అంతగా పెరుగుతున్నట్లుగా గమనించవచ్చు.

ఆ సూత్రంను సుకుమార్ అండ్‌ టీం ఫాలో అవుతున్నారేమో. అందుకే వచ్చే ఏడాది వరకు సినిమా ను తీసుకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2024 సమ్మర్‌ చివర్లో పుష్ప 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది కూడా కాదంటే వచ్చే ఏడాది దసరా వరకు వెయిట్‌ చేయిస్తారేమో. మొత్తానికి అయితే 2024 లో పుష్ప 2 రావడం పక్కా..!