Begin typing your search above and press return to search.

థ్యాంక్స్ వద్దు గ్రేట్‌ సాంగ్స్ కావాలి.. బన్నీ ట్వీట్‌ వైరల్‌

అల్లు అర్జున్‌ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

By:  Tupaki Desk   |   14 Sept 2023 3:30 PM IST
థ్యాంక్స్ వద్దు గ్రేట్‌ సాంగ్స్ కావాలి.. బన్నీ ట్వీట్‌ వైరల్‌
X

అల్లు అర్జున్‌ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్ నటించిన జవాన్ సినిమా సూపర్‌ హిట్ అయిన నేపథ్యం లో చిత్ర యూనిట్‌ సభ్యులకు అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశాడు. సినిమా కోసం వర్క్‌ చేసిన నటీ నటులు మరియు సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా చేశారంటూ బన్నీ పేర్కొన్నాడు.

షారుఖ్‌ ఖాన్‌ నటన పై ఇంకా విజయ్ సేతుపతి మరియు దీపికా పదుకొనే, నయనతార ఇలా అందరికీ కూడా తన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరిపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు. అనిరుధ్ గురించి స్పందిస్తూ నీవు ఇచ్చిన మ్యూజిక్ ను ప్రేక్షకులు లూప్ లో పెట్టుకుని వింటున్నారు అంటూ కామెంట్‌ చేశాడు.

అల్లు అర్జున్‌ ట్వీట్ కు సమాధానంగా సంగీత దర్శకుడు థాంక్యూ మై బ్రో అంటూ రీ ట్వీట్‌ చేయడం జరిగింది. అనిరుధ్‌ థాంక్యూ ట్వీట్ కి అల్లు అర్జున్‌ మరో ట్వీట్‌ చేశాడు. అదే ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ట్వీట్ లో ఏముందంటే.. నాకు సింపుల్‌ థాంక్యూ ఒక్కటి సరిపోదు, నాకు నీ నుండి గ్రేట్‌ సాంగ్స్ కూడా కావాలి అన్నట్లుగా ట్వీట్‌ చేశాడు.

ఈ ట్వీట్ తో అల్లు అర్జున్ కి అనిరుధ్‌ తో వర్క్ చేయాలనే కోరిక ఉందని తేలిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాను చేస్తున్న అల్లు అర్జున్‌ ఆ తర్వాత చేయబోతున్న సినిమాకు గాను అనిరుధ్ ను తన సినిమా సంగీత దర్శకుడిగా కోరుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం చేస్తున్న పుష్ప 2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే.

ఈ మధ్య కాలంలో అనిరుధ్‌ సంగీత సారధ్యం లో వచ్చిన ప్రతి మ్యూజిక్ ఆల్బం కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. సినిమాలు కూడా కమర్షియల్‌ గా భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. కనుక అనిరుధ్‌ తో ముందు ముందు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు చాలా మంది వర్క్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ స్టార్‌ హీరోల్లో అల్లు అర్జున్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అది ఎప్పుడు అనేది కాలమే నిర్ణయించాలి.