Begin typing your search above and press return to search.

ఐకాన్ స్టార్ నెక్స్ట్ అంత ఈజీ కాదు..!

పుష్ప రాజ్ పాత్రతో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించి ఔరా అనిపించాడు

By:  Tupaki Desk   |   17 April 2024 11:30 AM GMT
ఐకాన్ స్టార్ నెక్స్ట్ అంత ఈజీ కాదు..!
X

పుష్ప రాజ్ పాత్రతో పాన్ ఇండియా వైడ్ గా సెన్సేషన్ సృష్టించిన అల్లు అర్జున్ తన నట విశ్వరూపం చూపించి ఔరా అనిపించాడు. ఆర్య సినిమా నుంచి సుకుమార్ తో ఎప్పుడు సినిమా చేసినా సంథింగ్ స్పెషల్ అనిపించేలా మెస్మరైజ్ చేస్తూ వస్తున్న అల్లు అర్జున్ ఈసారి పుష్ప తో పూనకాలు తెప్పించేశాడు. పుష్ప 1 ప్రభావం ఎంత అన్నది ఇప్పటికీ ఎక్కడో ఒక చోట ఆ సినిమా రిఫరెన్స్ లు చూస్తేనే అర్ధమవుతుంది. అల్లు అర్జున్ కోసమే పుష్ప రాజ్ పాత్ర అన్నట్టుగా సినిమాతో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

ప్రస్తుతం పుష్ప 2 సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తో మరోసారి నేషనల్ లెవెల్ లో తన మాస్ స్టామినా చూపించాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమాల మీద పుష్ప రాజ్ ప్రభావం బాగా ఉంటుందని చెప్పొచ్చు. పుష్ప రాజ్ ని సినీ ప్రియులంతా ఓన్ చేసుకున్నారు. అల్లు అర్జున్ ని చూస్తే చాలు పుష్ప రాజ్ పాత్ర గుర్తుకొస్తుంది. అయితే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం, అట్లీ ఈ ఇద్దరిలో ఒకరితో సినిమా ఫిక్స్ చేసుకుంటున్నాడు.

పుష్ప తర్వాత అల్లు అర్జున్ చేసే సినిమా పుష్ప రాజ్ పాత్రని మించి ఉండాలి. లేదా ఆ పాత్రని మర్చిపోయేలా కొత్త క్యారెక్టరైజేషన్ తో కనిపించాలి. సో ఇది కచ్చితంగా పెద్ద టాస్కే అని చెప్పొచ్చు. ఇలాంటి టఫ్ టైంలో తన కథలు.. పాత్రలతో మెస్మరైజ్ చేస్తాడు గురూజీ. పుష్పకు ముందు అల వైకుంఠపురములో సినిమాతో అల్లు అర్జున్ ఖాతాలోనే కాదు నాన్ బాహుబలి రికార్డులన్ని బ్రేక్ చేశాడు.

మళ్లీ ఈ కాంబో రిపీట్ అయితే మాత్రం కచ్చితంగా పుష్ప రాజ్ ని మర్చిపోయే పాత్రని సృష్టిస్తారని చెప్పొచ్చు. పుష్ప తో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ త్రివిక్రం తో చేసే సినిమాతో కూడా నేషనల్ లెవెల్ లో భారీ అటెంప్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మాస్ పల్స్ తో పాటుగా ఎమోషనల్ టచ్ ఇవ్వడంలో త్రివిక్రం స్టైల్ సెపరేట్ గా ఉంటుంది. అందుకే పుష్ప తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం సినిమా మీద కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.