Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. పుష్ప తరువాత ఒకేసారి రెండు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని నాన్ స్టాప్ గా షూటింగ్లో అయితే పాల్గొంటున్నాడు

By:  Tupaki Desk   |   12 April 2024 8:42 AM GMT
అల్లు అర్జున్.. పుష్ప తరువాత ఒకేసారి రెండు!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి అని నాన్ స్టాప్ గా షూటింగ్లో అయితే పాల్గొంటున్నాడు. ఇక సుకుమార్ కూడా అదే స్పీడ్ లో కంటెంట్ పర్ఫెక్ట్ గా వచ్చేలా తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు. సినిమాను ఆగస్టు 15 రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇదివరకే చాలాసార్లు క్లారిటీ ఇచ్చింది. కొన్నిసార్లు ఈ విషయంలో రకరకాల గాసిప్స్ ఫ్యాన్స్ లో కంగారును కలిగించినప్పటికీ అందులో ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అని ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూనే ఉన్నారు.

ఇక పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ తదుపరి సినిమాను ఏ దర్శకుడితో వెంటనే మొదలుపెడతాడు అనేది కాస్త సస్పెన్స్ ని క్రియేట్ చేస్తోంది. ఇదివరకైతే త్రివిక్రమ్ తో నెక్స్ట్ సినిమా దాదాపు ఫిక్స్ అయినట్లే అని హారిక హాసిని గీతా ఆర్ట్స్ కాంబినేషన్ లోనే అల్లు అర్జున్ మరో సినిమాను త్వరగానే మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లుగా కథనాలు వెలువడ్డాయి. ఇక ఊహించిన విధంగా లిస్టులోకి తమిళ దర్శకుడు అట్లీ పేరు రావడంతో మళ్లీ బన్నీ లైనప్ లో మార్పులు వచ్చాయి.

ఇక ముందుగా అట్లి ప్రాజెక్టును సన్ పిక్చర్స్ లో మొదలుపెట్టి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు అల్లు అరవింద్ కూడా సహనిర్మాతగా ఉండే అవకాశం ఉంది. ఇక మరోవైపు త్రివిక్రమ్ కూడా బన్నీ కోసం ఒక కథను సిద్ధం చేసి ఉంచాడు. ఇక అన్ని అనుకున్నట్లు జరిగితే అట్లీ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన ఒక రెండు మూడు నెలల తర్వాత త్రివిక్రమ్ సినిమాను కూడా పట్టాలు ఎక్కించే అవకాశం ఉంది.

ఇక వచ్చే ఏడాది సమ్మర్ లో అట్లీ సినిమాను పూర్తిచేసే ఆ తర్వాత అదేఏ ఏడాది అక్టోబర్ నాటికి త్రివిక్రమ్ సినిమాను కూడా సిద్ధం చేసే ఆలోచనలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు కుదిరితే ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు. కానీ అల్లు అర్జున్ అంత స్పీడ్ గా రెండు సినిమాలను ఫినిష్ చేస్తాడా లేదా అనేది అసలు ప్రశ్న.

ప్రస్తుతం పుష్ప సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. దాదాపు 1000 కోట్లు టార్గెట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. ఆ దిశగా సినిమా ప్రమోషన్స్ కూడా చేయబోతున్నారు. ఇక దర్శకుడు అట్లీ ఇదివరకే జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల బాక్సాఫీస్ సక్సెస్ అందుకున్నాడు కాబట్టి బన్నీతో చేయబోయే సినిమా కూడా హై రేంజ్ లో ఉంటుంది అని చెప్పవచ్చు. మరి త్రివిక్రమ్ ప్రాజెక్టు ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.