Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. ముందు ఎవరితో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 10:27 AM GMT
అల్లు అర్జున్.. ముందు ఎవరితో?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ ని మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సాలిడ్ ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకున్నారు. పుష్ప ది రూల్ మూవీ ఆగష్టు 15న రిలీజ్ కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ ఉంటుందని గతంలో ప్రకటించారు. అయితే త్రివిక్రమ్ తాజాగా సూపర్ స్టార్ తో చేసిన గుంటూరు కారం మూవీకి ఆశించిన స్థాయిలో రిజల్ట్ రాలేదు.

దీంతో త్రివిక్రమ్ తో సినిమాపైన బన్నీ పునరాలోచనలో పడ్డాడనే టాక్ ఉంది. త్రివిక్రమ్ కూడా ప్రస్తుతం టైర్ 2 హీరోతో మూవీ చేసే ఆలోచనలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో మూవీని ఈ ఏడాదిలో సెట్స్ పైకి తీసుకెళ్లడం కష్టం అనే టాక్ కూడా నడుస్తోంది.

తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ లో పాన్ ఇండియా మూవీ ఉండబోతోందని ఎనౌన్స్ చేశారు. ఈ సినిమా అల్లు అర్జున్ హీరోగా సెట్స్ పైకి వెళ్తుందని టాక్. తాజాగా బోయపాటి బన్నీకి కథ చెప్పి ఒప్పించాడంట. పీరియాడికల్ జోనర్ కథ కావడంతో బన్నీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని తెలుస్తోంది. ఈ మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్తుందని టాక్ అయితే వినిపిస్తోంది.

బన్నీ దృష్టిలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఉన్నారంట. గత ఏడాది జవాన్ మూవీతో హిందీలో అట్లీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో అతని దర్శకత్వంలో ఎప్పటి నుంచో మూవీ చేయాలని అనుకుంటున్న బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా అది చేస్తే ఎలా ఉంటుందనేది ఆలోచిస్తున్నారంట. ఇలా బన్నీ లైన్ లో ముగ్గురు స్టార్ దర్శకులు ఉన్నారు.

ఎవరితో నెక్స్ట్ సినిమా చేయాలనేది ఛాయస్ అతని చేతిలోనే ఉందంట. అలాగే లిస్టులో సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నాడు. కానీ అతను యానిమల్ సీక్వెల్, ప్రభాస్ స్పిరిట్ అనంతరం బన్నీతో కలిసే ఛాన్స్ ఉంది. ఇక ఈ లోపు అల్లు అర్జున్ ముందు మరో ముగ్గురు దర్శకులతో చేసే ఛాన్స్ ఉంది.

ఆ ముగ్గురిలో బోయపాటి ప్రాజెక్ట్ నే ముందుగా పట్టాలు ఎక్కే అవకాశం ఉందనేది ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తోన్న మాట. స్కంద లాంటి డిజాస్టర్ ఇచ్చిన కూడా బోయపాటి గతంలో అల్లు అర్జున్ కి సరైనోడు లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చారు. అందుకే తాజాగా ఆయన చెప్పిన లైన్ కి ఒకే చెప్పినట్లు తెలుస్తోంది.