Begin typing your search above and press return to search.

సుక్కు ఓకే.. తెల్చాల్సింది హీరోనే..?

పుష్ప 1 తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 అంటూ ఆగష్టులో మరోసారి తన టాలెంట్ చూపించబోతున్నాడు.

By:  Tupaki Desk   |   26 March 2024 9:39 AM GMT
సుక్కు ఓకే.. తెల్చాల్సింది హీరోనే..?
X

పుష్ప 1 తో సంచలనం సృష్టించిన డైరెక్టర్ సుకుమార్ పుష్ప 2 అంటూ ఆగష్టులో మరోసారి తన టాలెంట్ చూపించబోతున్నాడు. ఆర్య నుంచి సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వచ్చిన సుకుమార్ పుష్ప 1 తో నేషనల్ వైడ్ గా క్రేజ్ ఏర్పరచుకున్నాడు. పుష్ప 2 తో కూడా మరోసారి ప్రభంజనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. పుష్ప 2 తర్వాత పుష్ప 3 ఉంటుందని తెలుస్తున్నా దాని గురించి డీటైల్స్ తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే పుష్ప తర్వాత సుకుమార్ చేసే సినిమాపై కొన్నాళ్లుగా పెద్ద చర్చ జరిగింది. రాం చరణ్ తోనే సుకుమార్ నెక్స్ట్ సినిమా అని లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. రంగస్థలం తర్వాత ఈ కాంబో నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తో రాబోతుంది. చరణ్ బర్త్ డే సందర్భంగా సుకుమార్ తో సినిమా ప్రకటించారు. ఈ సినిమా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవెల్ లో ఉండబోతుందని అర్థమవుతుంది.

అయితే పుష్ప తర్వాత సుకుమార్ సినిమా లాక్ అయ్యింది. డైరెక్టర్ గా పుష్ప తర్వాత తన సినిమా ఫిక్స్ చేసుకోగా పుష్ప హీరో అల్లు అర్జున్ మాత్రం తన నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వట్లేదు. అసలు అల్లు అర్జున్ మనసులో ఏం ఉందో తెలియాల్సి ఉంది. త్రివిక్రం తో తన సినిమా ప్రకటించిన అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత త్రివిక్రం రైట్ ఛాయిసా కాదా అన్నది ఆలోచనలో పడ్డాడని తెలుస్తుంది. ఇక మరోపక్క అట్లీతో అల్లు అర్జున్ సినిమా అంటూ కోలీవుడ్ మీడియా హడావిడి చేస్తుంది. త్రివిక్రం, అట్లీ, సందీప్ వంగ ఇలా త్రివిక్రం డైరెక్టర్స్ లిస్ట్ భారీగానే ఉండగా వీరిలో ఎవరు ముందు ఎవరు తర్వాత అన్నది తెలియాల్సి ఉంది.

సుకుమార్ కూడా ఇలానే తన నెక్స్ట్ సినిమా మీద రకరకాల గాసిప్పులకు ఛాన్స్ ఇచ్చి ఫైనల్ గా తన రంగస్థలం హీరోతోనే సినిమా లాక్ చేసుకున్నాడు. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ సినిమా చేసే డైరెక్టర్ ఎవరన్నది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్నారు ఆడియన్స్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఐకాన్ స్టార్ నెక్స్ట్ సినిమా అఫీషియల్ అప్డేట్ వస్తుందేమో చూడాలి. అప్పటివరకు అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా గురించి ఎలాంటి వార్త వచ్చినా సరే దాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు.