Begin typing your search above and press return to search.

అక్కడికెళ్తే బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్

ఇప్పుడు అలాంటి క్రేజ్ అల్లు అర్జున్ కి ఉంది. వారికి బన్నీ వస్తున్నాడని ఎలాగో తెలుసుకొని చూడటానికి వచ్చేస్తూ ఉంటారు అని చంద్రశేఖర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   1 March 2024 4:07 AM GMT
అక్కడికెళ్తే బన్నీ క్రేజ్ నెక్స్ట్ లెవల్
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రస్తుతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయిన కూడా తరువాత తనకంటూ సొంత స్టైల్ క్రియేట్ చేసుకొని ఫ్యాన్స్ ని పెంచుకున్నాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ గా బన్నీ నిలిచాడంటే ఏ స్థాయిలో తనని తాను ప్రూవ్ చేసుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు.

విమర్శించిన నోళ్ళతోనే ప్రశంసించేలా చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని బన్నీ ఆర్మీ అంటున్నారు. బన్ని ఎక్కడికి వెళ్ళిన వేళల్లో అభిమానులు వస్తూ ఉంటారు. చెప్పకుండా వెళ్ళిన కూడా అభిమానులకి మాత్రం తెలిసిపోతుంది. ఎంత దూరం ఉన్న బన్నీ కోసం వచ్చేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని బన్నీ మామ. స్నేహారెడ్డి తండ్రి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి కూడా చెప్పడం విశేషం.

ఆయన రాజకీయ నాయకుడిగా ఉన్నారు. సొంతూరులో ఫెస్టివల్స్ కి వెళ్తూ ఉంటారు. వారిది నల్గొండ జిల్లా. అల్లు అర్జున్ చెప్పకుండానే ఒక్కోసారి మా ఇంటికి వస్తూ ఉంటాడు. అయితే అభిమానులకి ఎలా తెలిసిపోతుందో గాని 60, 70 కిలోమీటర్ల దూరం నుంచి బన్నీని చూడటానికి మా ఊరు వచ్చేస్తూ ఉంటారు. మా చిన్న వయస్సులో మెగాస్టార్ ని చూడటానికి మేము సరదా పడేవాళ్ళం.

ఇప్పుడు అలాంటి క్రేజ్ అల్లు అర్జున్ కి ఉంది. వారికి బన్నీ వస్తున్నాడని ఎలాగో తెలుసుకొని చూడటానికి వచ్చేస్తూ ఉంటారు అని చంద్రశేఖర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాగే అల్లు అర్జున్ కూతురు అర్హకి పిల్లలు అంటే చాలా ఇష్టం అని. ఊరు వచ్చినపుడు గ్రామీణ ప్రాంతంలో ఉండే తన ఏజ్ వారితో చాలా ఈజీగా కలిసిపోతుందని తెలిపారు.

అలాగే అర్హ స్వచ్చంగా తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడుతూ అందరితో మాటలు కలిపేస్తూ ఉంటుంది అంటూ మనవరాలు గురించి చంద్రశేఖర్ గొప్పగా చెప్పుకొచ్చారు. అర్హ తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. అలాగే పాటలు కూడా పాడుతూ ఉంటుంది. చాలా సార్లు ఆమెకి సంబందించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇక ప్రస్తుతం బన్నీ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా షూట్ శరవేగంగా కొనసాగుతోంది. ఇక సినిమాను ఆగస్టులో విడుదల కాబోతోంది. త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు. ఇక బన్నీ మరోవైపు త్రివిక్రమ్ తో కూడా మరో సినిమా చేయనున్నాడు. లిస్టులో సందీప్ రెడ్డి వంగా తో కూడా ఒక సినిమా ఉంది.