Begin typing your search above and press return to search.

బెస్ట్ ఫ్రెండ్ తో పాన్ వరల్డ్ బొమ్మ..!

ఈ క్రమంలో అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ మారుతి బన్నీతో సినిమా చేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండాలని అనుకుంటున్నాడట.

By:  Tupaki Desk   |   14 Feb 2024 3:00 AM GMT
బెస్ట్ ఫ్రెండ్ తో పాన్ వరల్డ్ బొమ్మ..!
X

కేవలం తెలుగు సినిమాలతోనే పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. పుష్ప 1 తో నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ ఆ సినిమాను ముందు కేవలం తెలుగు వరకే రిలీజ్ చేయాలని అనుకోగా రాజమౌళి సలహా మేరకు పాన్ ఇండియా రిలీజ్ చేయగా అది కాస్త బీ టౌన్ ఆడియన్స్ కి బాగా నచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పుష్ప 1 లో పుష్ప రాజ్ నట విశ్వరూపం తో నేషనల్ అవార్డ్ సైతం దక్కించుకున్నాడు.

రాజమౌళి సినిమాతో కాకుండా నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న హీరోగా అల్లు అర్జున్ పేరు మారుమోగుతుంది. అయితే అల్లు అర్జున్ కి వచ్చిన ఈ పాన్ ఇండియా ఇమేజ్ పెంచేలా పాన్ వరల్డ్ వరకు అతన్ని పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ మారుతి బన్నీతో సినిమా చేస్తే అది ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉండాలని అనుకుంటున్నాడట.

మారుతి ఏంటి పాన్ వరల్డ్ సినిమా ఏంటని అనుకోవచ్చు. ఈరోజుల్లో సినిమా తో దర్శకుడిగా తన తొలి ప్రయత్నం చేసిన మారుతి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తున్నాడు. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ సినిమా అంటేనే రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. కానీ మారుతి ప్లాన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.

మారుతి డైరెక్టర్ గా రాకముందు అల్లు అర్జున్ తో కలిసి మల్టీమీడియా నేర్చుకున్నాడు. ఆ టైం లోనే బన్నీతో పరిచయం స్నేహంగా మారి ఆ తర్వాత వారి ఫ్రెండ్ షిప్ కొనసాగేలా చేసింది. డైరెక్టర్ గా మారుతి ఇంత క్రేజ్ తెచ్చుకున్నా సరే అల్లు అర్జున్ తో సినిమా మాత్రం చేయలేదు. పుష్ప తో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్ తో మారుతి సినిమా అంటూ చేస్తే మాత్రం అది పాన్ వరల్డ్ బొమ్మగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నాడట.

రాజా సాబ్ హిట్ పడితే పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో మారుతి కూడా చేరిపోయినట్టే సో ఆ తర్వాత ఎలాగు పాన్ వరల్డ్ అటెంప్ట్ గా అల్లు అర్జున్ తో సినిమా చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి ఇది నిజంగా జరుగుతుందా బెస్ట్ ఫ్రెండ్ కోసం మారుతి ఇంటర్నేషనల్ ఆడియన్స్ మెప్పించే కథ సిద్ధం చేస్తాడా లేదా అన్నది చూడాలి.