Begin typing your search above and press return to search.

ప్రేమ‌తో అల్లుడికి మ‌రోసారి మామ గ్రాండ్ పార్టీ!

అల్లుడు అల్లు అర్జున్ అంటే మామ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి ఎంత అభిమాన‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. అల్లుడిగా బ‌న్నీకి వంద మార్కులేస్తా అంటారు. ఒక్క రూపాయి కూడా క‌ట్నం తీసుకోలేదు.

By:  Tupaki Desk   |   19 Oct 2023 5:07 PM GMT
ప్రేమ‌తో అల్లుడికి మ‌రోసారి మామ గ్రాండ్ పార్టీ!
X

అల్లుడు అల్లు అర్జున్ అంటే మామ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డికి ఎంత అభిమాన‌మో చెప్పాల్సిన ప‌నిలేదు. అల్లుడిగా బ‌న్నీకి వంద మార్కులేస్తా అంటారు. ఒక్క రూపాయి కూడా క‌ట్నం తీసుకోలేదు. వాళ్ల‌కే చాలా ఆస్తి ఉంది. నేను ఇచ్చేది వాళ‌ల్కి లెక్క‌లోకే రాదు. ఇంకాచెప్పాలంటే వాళ్లంతా క‌ట్న‌కానుక‌ల‌కి వ్య‌తిరేకం అని బ‌న్నీ మంచి మ‌న‌సును మెచ్చుకున్న సంద‌ర్భాలెన్నో.

బిడ్డ భ‌ర్త ఎదిగితే సంతోషప‌డేది త‌ల్లిదండ్రు లే కాదు..పిల్లని ఇచ్చిన అత్త మామాలు కూడా అంతే గ‌ర్వంగా ఫీల‌వుతారని చాటా చెప్పారు. అల్లుడు కూడా కుమారుడు స‌మానుడే అంటారు. అల్లుడంటే మామ‌కి అంత ఇష్టం. ఇక అల్లుడు ఎదుగుతోన్న ప్ర‌తీసారి మామ పార్టీలివ్వ‌డం కామ‌న్ గా మారిపోయింది. 'పుష్ప' ది రైజ్ పాన్ ఇండియాలో భారీ విజ‌యం సాధించ‌డంతో చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఇటీవ‌లే గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.

బ‌న్నీని సాలువాతో స‌త్క‌రించి గ్రాండ్ గా పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీ మూవ్ మెంట్స్ ని మ‌ర్చిపోక ముందే తాజాగా మ‌రో పార్టీ షురూ చేసిన సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. జాతీయ ఉత్త‌మ న‌టుడిగా బ‌న్నీ అవార్డు ద‌క్కించుకున్న సంగ‌తి తెలిసిందే. రెండు రోజుల క్రిత‌మే అవార్డుల ప్ర‌దానోత్స‌వం కూడా జ‌రిగింది. ఈసంద‌ర్భంగా గ‌త రాత్రి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి మ‌రోసారి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.

ఈ పార్టీకి స‌న్నిహితులు..స్నేహితులు..ఇండ‌స్ట్రీకి చెందిన వారంతా హాజ‌రైన‌ట్లు తెలుస్తోంది. బ‌న్నీకి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి పుష్ప గుచ్చం అందించి పార్టీకి ఆహ్వానించిన‌ట్లు తెలుస్తోంది. అలాగే అల్లు అర‌వింద్.. శిర‌ష్ ..సుకుమార్ త‌దిత‌రులు పార్టీలో క‌నిపించారు. కొంత మంది రాజ‌కీయ నాయ‌కులు హాజ‌రైన‌ట్లు స‌మాచారం.