Begin typing your search above and press return to search.

బన్నీ లైనప్ మాములుగా లేదుగా..!

ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో బన్నీ చేయబోయే సినిమాలన్నీ అగ్ర దర్శకులతోనే ఉండబోతుండడం విశేషం.

By:  Tupaki Desk   |   29 Nov 2023 8:30 AM GMT
బన్నీ లైనప్ మాములుగా లేదుగా..!
X

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ ప్రస్తుతం 'పుష్ప 2' షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. పార్ట్-1 భారీ విజయాన్ని అందుకోవడం, బన్నీకి నేషనల్ అవార్డ్ కూడా రావడంతో 'పుష్ప2' విషయంలో అటు సుకుమార్ ఇటు బన్నీ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా బన్నీ పుష్ప సక్సెస్ తర్వాత తన తదుపరి చిత్రాల విషయంలోనూ ఎంతో కేర్ తీసుకుంటున్నాడు.

పుష్ప తో వచ్చిన క్రేజ్ ని తన ఫ్యూచర్ ఫిలిమ్స్ తో మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో బన్నీ చేయబోయే సినిమాలన్నీ అగ్ర దర్శకులతోనే ఉండబోతుండడం విశేషం. 'పుష్ప2' తర్వాత ఈ హీరో లైనప్ మామూలుగా లేదు. బన్నీ లైనప్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం అవుతున్నాయి. ప్రస్తుతం 'పుష్ప2' ని పూర్తిచేసే పనిలో ఉన్న బన్నీ తన తదుపరి చిత్రాన్ని మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో చేయబోతున్నాడు.

కొద్ది రోజుల కిందే బన్నీ బోయపాటితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఆ తర్వాత త్రివిక్రమ్ తో భారీ సోషో ఫాంటసీ సినిమా ఉంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెలిసిందే. దీనికంటే ముందే అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగతో యాక్షన్ ఫిలిం చేసేందుకు ఒప్పుకున్నాడు బన్నీ.

ఈ ప్రాజెక్టును కూడా కొద్ది నెలల క్రితం ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతోనూ మరో యాక్షన్ ఫిలిం చేసేందుకు బన్నీ రెడీ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా 'జవాన్' తో భారీ హిట్ అందుకున్న అట్లీ ఎప్పటినుంచో బన్నీతో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. జవాన్ సక్సెస్ తో బన్నీ కూడా అట్లితో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద బన్నీ అప్ కమింగ్ లైనప్ లో అందరూ స్టార్ డైరెక్టర్స్ ఉండడం విశేషమనే చెప్పాలి. రానున్న రోజుల్లో ఈ ప్రాజెక్ట్ లన్నీ వర్క్ అవుట్ అయితే బన్నీ క్రేజ్ పీక్స్ కి చేరుకోవడం గ్యారెంటీ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ డైరెక్టర్స్ లో బన్నీ మొదట ఎవరితో సినిమా చేస్తాడు? అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న 'పుష్ప2' వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానంది.