Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. 2 వారాల్లో మూడుసార్లు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   25 March 2024 3:30 PM GMT
అల్లు అర్జున్.. 2 వారాల్లో మూడుసార్లు!
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2 మూవీతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది నెలలుగా.. బన్నీ కంటిన్యూగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. సినిమా కంప్లీట్ అవ్వడానికి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల ఈ మూవీ షూట్ ఓ టెంపుల్ లో జరుగుతున్నట్లు హీరోయిన్ రష్మిక మందన్న అప్డేట్ ఇచ్చింది. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.

ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్.. రెస్ట్ తీసుకుంటారా లేక వెంటనే కొత్త ప్రాజెక్ట్ పట్టలెక్కిస్తారోనని తెలియాల్సి ఉంది. పుష్ప-2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తో బన్నీ వర్క్ చేయనున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అట్లీ మూవీ తర్వాతే అల్లు అర్జున్.. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగా తదితరులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అట్లీ ఇటీవల జవాన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

అయితే అల్లు అర్జున్ బర్త్ డే ఏప్రిల్ 7వ తేదీన అట్లీ- బన్నీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రానుందని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. అదే రోజు పుష్ప టీజర్ కూడా విడుదల అవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకోసం మూవీ టీమ్.. చాలా కష్టపడుతుందట. కచ్చితంగా ఆడియన్స్ ను అలరించాలని ఫిక్స్ అయిందట. అనుకున్నట్లు జరిగితే.. పుష్ప-2 టీజర్ ఇండస్ట్రీని షాక్ చేయనుందని చెప్పవచ్చు.

అంతకుముందు బన్నీ బర్త్ డే కానుకగా.. అల్లు అర్జున్ నటించిన మూవీ ఆర్య-2 రీ రిలీజ్ కానుంది. 15 ఏళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా.. ఇప్పుడు థియేటర్లలో మళ్లీ సందడి చేయనుంది. ఏప్రిల్ 6 లేదా ఏప్రిల్ 7వ తేదీన ఆర్య-2.. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ప్రదర్శితమవ్వనుంది. ఇక మరికొద్ది రోజుల్లో అల్లు అర్జున్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరనుంది.

దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం కొలువుదీరనుంది. అందుకు సంబంధించిన కొలతలను మ్యూజియం నిర్వాహకులు ఇటీవల తీసుకున్నారు. అక్కడ ఇప్పటికే టాలీవుడ్ హీరోలు మహేశ్, ప్రభాస్ విగ్రహాలు ఉన్న విషయం తెలిసిందే. బన్నీ కూడా ఆ లిస్ట్ లోకి చేరనున్నారు. మార్చి 28వ తేదీ జరగనున్న ఈ ఆవిష్కరణ వేడుకలకు అల్లు అర్జున్ కూడా హాజరవనున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి ఆ విగ్రహం ఎలా ఆకట్టుకుంటుందో.