Begin typing your search above and press return to search.

ఇన్‌స్టాపై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ దాడి..!

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరోసారి సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు. ఈసారి ఇన్‌ స్టాగ్రామ్‌ పై కోపంతో ట్రోల్స్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Dec 2023 5:54 AM GMT
ఇన్‌స్టాపై అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ దాడి..!
X

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరోసారి సోషల్ మీడియా లో సందడి చేస్తున్నారు. ఈసారి ఇన్‌ స్టాగ్రామ్‌ పై కోపంతో ట్రోల్స్ చేస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం అయిన ఇన్‌స్టాగ్రామ్‌ గతంలో అల్లు అర్జున్‌ జాతీయ అవార్డును సొంతం చేసుకున్న సందర్భంగా ఒక ప్రత్యేకమైన వీడియోను తమ అధికారిక ఖాతాలో షేర్‌ చేయడం జరిగింది.

ఇన్‌స్టాగ్రామ్‌ అధికారిక ఖాతాలో ఒక టాలీవుడ్‌ స్టార్‌ కి చెందిన వీడియో షేర్‌ అవ్వడం అప్పట్లో సంచలనంగా నిలిచింది. అంతే కాకుండా మన అల్లు అర్జున్‌ ను ఇన్‌స్టాగ్రామ్‌ అధికారిక ఖాతా ఫాలో అవ్వడం కూడా మొదలు పెట్టారు. దాంతో అప్పట్లో అంతా కూడా అల్లు అర్జున్‌ కి దక్కిన గౌరవం అంటూ మాట్లాడుకున్నారు. అయితే ఇప్పుడు ఇన్‌ స్టా అధికారిక ఖాతా అల్లు అర్జున్‌ ను అన్‌ ఫాలో చేయడం జరిగింది.

అల్లు అర్జున్‌ ను అప్పుడు ఫాలో అయ్యి... ఇప్పుడు అన్ ఫాలో అవ్వడం తో ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అప్పుడు ఎందుకు ఫాలో అవ్వడం.. ఇప్పుడు పరువు తీసే విధంగా ఎందుకు అన్‌ ఫాలో అవ్వడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోను అన్‌ ఫాలో చేసిన ఇన్‌ స్టా అధికారిక ఖాతాను చాలా మంది ఫ్యాన్స్ అన్ ఫాలో చేస్తున్నారు.

మొత్తానికి అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ కి ఇన్‌ స్టాగ్రామ్‌ అధికారిక ఖాతాపై కోపం వచ్చింది. ఆ ఐడీ ని ట్యాగ్‌ చేస్తూ సోషల్‌ మీడియా ద్వారా విమర్శలు చేస్తూ, ఫన్నీ మీమ్స్ ను క్రియేట్‌ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్‌ కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్‌ నేపథ్యం లో అల్లు అర్జున్‌ ను ఇన్‌ స్టా ఫాలో అవ్వడం కంటిన్యూ చేయాల్సింది అని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇన్‌స్టా అధికారిక ఖాతా ఈ మధ్య కొన్ని కారణాల వల్ల చాలా మందిని అన్‌ ఫాలో అయ్యింది. అందులో అల్లు అర్జున్‌ తో పాటు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఆలియా భట్ ఇంకా కొందరు కూడా ఉన్నారు. ఈ విషయమై ఇన్‌ స్టా కి చెందిన వారు ఏమైనా ప్రకటన చేస్తారా అనేది చూడాలి.

ఇక అల్లు అర్జున్‌ సినిమాల విషయానికి వస్తే సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప 2 సినిమా ను చేస్తున్నాడు. 2024 ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతుంది. పుష్ప 1 కి బన్నీ జాతీయ అవార్డు దక్కించుకోవడం తో పాటు పాన్‌ ఇండియా రేంజ్‌ లో భారీ వసూళ్లు నమోదు చేసుకుంది. కనుక పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.