Begin typing your search above and press return to search.

బన్నీ సడన్ ట్రిప్.. ఎందుకంటే..

ఈ మైనపు విగ్రహావిష్కరణ వేడుకల్లో పాల్గొనేందుకు అల్లు అర్జున్.. తాజాగా దుబాయ్ వెళ్లారు. సతీమణి స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి బన్నీ దుబాయ్ లో ఫుల్ చిల్ అవుతున్నారు.

By:  Tupaki Desk   |   26 March 2024 6:14 PM GMT
బన్నీ సడన్ ట్రిప్.. ఎందుకంటే..
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. గత కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ లోనే పాల్గొంటున్నారు. మూవీని అనుకున్న తేదీకి రిలీజ్ చేయాలని నిర్ణయించుకుని మేకర్స్ కు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఓ ఆలయంలో జరుగుతోంది. ఈ విషయాన్ని రష్మిక మందన్న ఇటీవల సోషల్ మీడియాలో తెలిపింది.

ఇక పుష్ప-2 షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల ఈ మధ్య అల్లు అర్జున్ ఎలాంటి ఫారిన్ ట్రిప్ వెళ్లలేదు. అటు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తూ.. ఇటు సినిమా సెట్స్ కు వస్తున్నారు. ఇటీవల పుష్ప సినిమాకు గాను నేషనల్ అవార్డు అందుకున్న బన్నీ.. టాలీవుడ్ తొలి హీరోగా రికార్డు క్రియేట్ చేశారు. తాజాగా మరో అరుదైన ఘనత సాధించనున్నారు. దుబాయ్ లో ఫేమస్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మన బన్నీ విగ్రహం కొలువుదీరనుంది.

ఈ మైనపు విగ్రహావిష్కరణ వేడుకల్లో పాల్గొనేందుకు అల్లు అర్జున్.. తాజాగా దుబాయ్ వెళ్లారు. సతీమణి స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హతో కలిసి బన్నీ దుబాయ్ లో ఫుల్ చిల్ అవుతున్నారు. ఫ్యామిలీతో కలిసి వరల్డ్ మోస్ట్ ఫేమస్ బూర్జ్ ఖలీఫాను సందర్శించారు. దుబాయ్ లోని ఒపెరీ గ్యాలరీకి కూడా వెళ్లారు. కుటుంబంతో నగరాన్ని చుట్టేస్తున్నారు. ఫేమస్ ప్లేసులన్నింటీకి వెళ్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బన్నీ సతీమణి స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోల్లో అయాన్, అర్హ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచారు. ఓ షాపింగ్ మాల్లో హుషారుగా తిరిగేస్తూ అల్లరి చేశారు. అయాన్ ఎప్పటిలానే తెగ అల్లరి చేశాడు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు. బన్నీ అన్న ఎక్కడున్నారు వదినా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇప్పటికే పలు నగరాల్లో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియాల్లో పలువురు టాలీవుడ్ నటీనటుల విగ్రహాలు ఉన్నాయి. బ్యాంకాక్ మ్యూజియంలో ప్రభాస్, సింగపూర్ మ్యూజియంలో మహేశ్ బాబు మైనపు విగ్రహాలు ఉన్న విషయం తెలిసిందే. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు కూడా ఇటీవల ఈ గౌరవం దక్కింది. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి అల్లు అర్జున్ కూడా చేరనున్నారు. మొత్తానికి బన్నీ విగ్రహం ఎలా ఉంటుందో చూడాలి మరి.