Begin typing your search above and press return to search.

బన్నీ బావ చ‌ర‌ణ్ కి గ్రాండ్ విషెస్!

నేడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు కావ‌డంతో అభిమానుల విషెస్ తో సోష‌ల్ మీడియా షేక్ అవుతోంది

By:  Tupaki Desk   |   27 March 2024 6:51 AM GMT
బన్నీ బావ చ‌ర‌ణ్ కి గ్రాండ్ విషెస్!
X

నేడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ పుట్టిన రోజు కావ‌డంతో అభిమానుల విషెస్ తో సోష‌ల్ మీడియా షేక్ అవుతోంది. త‌మ‌దైన శైలిలో అభిమానం చాటుతూ విషెస్ తెలియజేస్తున్న పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక సెల‌బ్రిటీలు...స‌న్నిహితులు..స్నేహితులు అంతా చ‌ర‌ణ్ కి శుభాకాంక్ష‌లు తెలియ జేస్తున్నారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే బావ చ‌ర‌ణ్ కి ఎంతో ప్ర‌త్యేకంగా విషెస్ తెలియజేసారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చరణ్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి `హ్యాపీ బర్త్ డే` అంటూ విష్ చేసారు.

ఇక్క‌డ చ‌ర‌ణ్ వైట్ క‌ల‌ర్ ష‌ర్ట్ ప్యాంట్ లో ఉండ‌గా..బ‌న్నీ మాత్రం బ్లాక్ దుస్తుల్లో న‌వ్వుతూ క‌నిపిస్తున్నారు. ఇది ప‌బ్ లో దిగిన ఫోటో లా ఉంది. బ‌ర్త్ డ్ పార్టీ ఎంజాయ్ చేస్తోన్న స‌మ‌యంలో క్యాప్చ‌ర్ చేసిన పిక్ ఇది. మ‌రి ఈపార్టీలో ఇంకా ఎవ‌రెవ‌రు? ఉన్నారు? అన్న‌ది తెలియాలి. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. చ‌ర‌ణ్‌..బ‌న్నీ అభిమానుల్ని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. బావ‌-బామ్మ‌ర్ది ఇద్ద‌రు ఒకే ప్రేమ్ లో అంటూ ఫ‌న్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. నేడు ఇద్ద‌రు పాన్ ఇండి యా స్టార్లే! క‌దా మ‌రి ఆ ఇద్దరు క‌లిసి సినిమా చేసేది? ఎప్పుడంటూ ఓ నెటి జ‌నుడు పోస్ట్ చేసాడు. వాళ్లిద్ద‌రు క‌లిసి న‌టించాల‌ని అల్లు అర‌వింద్ కూడా అంతే కోరుకుంటున్నారు.

ఇద్ద‌రి కోసం ఇప్ప‌టికే చ‌ర‌ణ్- అర్జున్ అంటూ ఓ టైటిల్ కూడా రిజిస్ట‌ర్ చేయించిన సంగ‌తి తెలిసిందే. ఆ కాంబినేష‌న్ ని అర‌వింద్ గారే నిర్మిస్తే అంత‌కు మించిన సంతోషం ఏముంటుంది. విషెస్ సంగ‌తి చూస్తే టాలీవుడ్ నుంచి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ స‌హా ప‌లువురు సెల‌బ్రిటీలు విషెస్ తెలియ‌జేసారు.

రామ్ చరణ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాల‌ని.. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటాడని.. పెద్ద వారి పట్ల.. సాంప్రదాయ పద్ధతులు పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తాడని.. ప్రతి విషయంలోనూ విద్యార్థిలా నడుచు కుంటాడన్నారు. ఇవే త‌న‌కి శ్రీరామ ర‌క్ష‌` అని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇక చ‌ర‌ణ్ కుటుంబంతో తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. అత్తమామలు- భార్య ఉపాసన- కుమార్తె క్లీంకారతో కలిసి రామ్ చరణ్ శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.