Begin typing your search above and press return to search.

బెస్ట్ ఫ్రెండ్ కి ఛాన్స్ ఎప్పుడు ఇస్తాడో..?

క్లోజ్ ఫ్రెండ్ మీద అల్లు అర్జున్ కి ఆమాత్రం నమ్మకం లేదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 Sep 2023 3:00 AM GMT
బెస్ట్ ఫ్రెండ్ కి ఛాన్స్ ఎప్పుడు ఇస్తాడో..?
X

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా మారుతి తన మార్క్ సినిమాలతో అలరిస్తూ వస్తున్నాడు. మచిలీపట్నం నుంచి వచ్చిన మారుతి అల్లు అర్జున్ తో కలిసి ఒక గ్రాఫిక్స్ ఇన్ స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారని తెలిసిందే. ఆ టైం లోనే అల్లు అర్జున్ మారుతి మధ్య ఫ్రెండ్ షిప్ పెరిగింది. ఇక చిన్నగా మారుతి దర్శకత్వం వైపు అడుగులు వేయడం బన్నీకి తెలియకుండానే ఈ రోజుల్లో సినిమా తీశాడు. అప్పటి నుంచి తన ప్రతి సినిమాతో సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు మారుతి. క్లోజ్ ఫ్రెండ్ అయినా కూడా అల్లు అర్జున్ హెల్ప్ లేకుండానే మారుతి కెరీర్ గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చాడు.

ముందు స్మాల్ బడ్జెట్ సినిమాలతో మొదలైన మారుతి కెరీర్ చిన్నగా మీడియం బడ్జెట్ రేంజ్ కి వెళ్లాడు. లేటెస్ట్ గా పాన్ ఇండియా హీరో ప్రభాస్ తో కూడా సినిమా చేస్తున్నాడు. ప్రభాస్ మారుతి కాంబో సినిమా థ్రిల్లర్ జోనర్ లో సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో పిలిచి అవకాశం ఇచ్చాడు కానీ సొంత ఫ్రెండ్ అల్లు అర్జున్ మారుతితో సినిమా చేయడానికి సాహసించలేదు. క్లోజ్ ఫ్రెండ్ మీద అల్లు అర్జున్ కి ఆమాత్రం నమ్మకం లేదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ కూడా కెరీర్ లో ప్రయోగాలు చేస్తూ వచ్చారు పుష్ప సినిమాతో 69వ నేషనల్ అవార్డుల్లో బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకుని సత్తా చాటాడు. పుష్ప తో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్ తో మారుతి కూడా సినిమా చేయాల్సి వస్తే సరైన కథ కుదరాల్సిందే. పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించగలం అనుకున్నప్పుడే వీరిద్దరి కాంబో సెట్ అవుతుందని చెప్పొచ్చు.

ఫ్రెండ్ కాబట్టి మారుతితో సినిమా చేయడానికి అల్లు అర్జున్ పెద్దగా ఆలోచించడు కానీ ఇప్పుడు వచ్చిన నేషనల్ లెవెల్ క్రేజ్ తో అటు తనకు తన ఫ్రెండ్ మారుతి రేంజ్ కూడా పెంచేలా సినిమా చేయాలని అనుకుంటారు. సో మారుతి తో అల్లు అర్జున్ జత కడితే ఆ సినిమా లెక్క వేరేలా ఉంటుందని ఫిక్స్ అవ్వొచ్చు. అంతేకాదు మారుతి ప్రభాస్ తో చేస్తున్న సినిమాతో హిట్ కొడితే మాత్రం ఇప్పటివరకు అతనితో చేయాలన్న ఆలోచన రాకపోయినా కూడా బన్నీ స్వయంగా ఓ కథ రెడీ చేయమని చెప్పొచ్చు. హీరో డైరెక్టర్ ఫ్రెండ్ షిప్ కేవలం ఆఫ్ స్క్రీన్ వరకే కాకుండా ఆన్ స్క్రీన్ మీద కూడా అదరగొట్టాలని ప్రేక్షకులు కోరుతున్నారు.